Bigg Boss 6 Telugu Contestants: స్టేజ్‌పైనే ఓపెన్‌గా బాయ్‌ఫ్రెండ్‌ పేరు చెప్పిన ఫైమా

4 Sep, 2022 20:56 IST|Sakshi

Faima In Bigg Boss 6 Telugu: జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్‌ ఫైమా. పటాస్‌ షోతో గుర్తింపు పొందిన ఫైమా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనకంటే ఎంతోమంది సీనియర్స్‌ ఉన్నా తనపై బాడీ షేమింగ్ చేస్తున్నా ఫైమా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తుంది. ఈమె వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే.

కమెడియన్‌ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్లు స్టేజ్‌పైనే ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది ఫైమా. 35 ఏళ్లుగా తమ కుటుంబం రెంట్‌ ఇంట్లోనే ఉంటున్నామని చెప్పింది ఫైమా. రీసెంట్‌గానే తన ఫ్యామిలీకి ఇల్లు కట్టించి ఇచ్చానని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. తనదైన శైలిలో కమెడీతో అలరించే ఫైమా బిగ్‌బాస్‌ షోలో ఎంత వరకు మెప్పిస్తుందో చూద్దాం.

మరిన్ని వార్తలు