నీ వెటకారం ఏంట్రా? శ్రీహాన్‌పై కీర్తి ఫైర్‌, ఇనయను ఆడుకున్న హౌస్‌మేట్స్‌

31 Oct, 2022 19:04 IST|Sakshi

నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌ మీదున్నారు హౌస్‌మేట్స్‌. ఎనిమిదో వారం సూర్య వెళ్లిపోగా అతడు ఎలిమినేట్‌ అవడానికి ఇనయ కారణం అంటూ ఆమెకు నామినేసన్స్‌ గుద్దిపడేస్తున్నారు. వారానికో రంగు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి ట్యాగ్‌ ఇచ్చింది.. ఫ్రెండ్‌షిప్‌లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరు అంటూ ఇనయను నామినేట్‌ చేశాడు శ్రీహాన్‌.

సూర్యను ఎక్కడ కొట్టాలో కొట్టావు, దెబ్బకు వెళ్లిపోయాడన్నాడు ఆది. అయితే ఇనయ మాత్రం ఆదిరెడ్డి ఫేక్‌ ఆడుతున్నాడంటూ కుండను పగలగొట్టేందుకు వెళ్లగా అతడు మాత్రం హే, పో.. కొట్టమాకు అంటూ కుండ దాచేసుకున్నాడు. చమ్కీలకు, గోధుమపిండి, మరమరాలకు అన్నింటికీ నామినేట్‌ చేస్తావ్‌ అంటూ ఇనయను ఆడుకున్నాడు ఆది. శ్రీహాన్‌.. ఈరోజు మనం ఫస్ట్‌ చెప్పుకోబోయే చాప్టర్‌ పేరు హ్యుమానిటీ. నువ్వు మా దగ్గర చేపలు లాక్కుంటున్నప్పుడు శ్రీసత్య డ్రెస్‌ పైకి వెళ్లిపోతుంటే హ్యుమానిటీ గుర్తుకురాలేదా? అని అడిగాడు. దీనికి చిర్రెత్తిన కీర్తి.. నీట్‌గా నిల్చుని మాట్లాడినప్పుడు నీ ఎటకారం ఏంట్రా? అంది. రా.. అనకు అంటూ ఫైర్‌ అయ్యాడు శ్రీహాన్‌.

నా వెటకారం మోతాదు మించిపోయిందని నామినేట్‌ చేశావు, నీ మంచితనం మోతాదు మించిపోయింది అంటూ బాలాదిత్యను నామినేట్‌ చేసింది ఫైమా. మంచితనానికి కూడా నామినేట్‌ చేస్తారా? అని షాకవుతున్నారు ఆడియన్స్‌. చివర్లో శ్రీహాన్‌ పంచ్‌ మాత్రం అదిరిపోయింది. ఇనయ దగ్గరకు వెళ్తూ.. ఒక్కటి మాత్రం నువ్వు చేయలేవు అంటూ ఈరోజు నన్ను నామినేట్‌ చేయలేవు అని హ్యాపీగా ఫీలయ్యాడు.

చదవండి: నాలో విన్నర్‌ క్వాలిటీస్‌, నేనే బిగ్‌బాస్‌ విన్నర్‌
సినిమాల జాతర.. థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే!

మరిన్ని వార్తలు