Bigg Boss 6 Telugu Winner: బిగ్‌బాస్‌ విన్నర్‌గా రేవంత్‌.. అతడి గెలుపుకు కారణాలివే!

18 Dec, 2022 23:15 IST|Sakshi

టైటిల్‌ గెలిచేది నేనే, రాసిపెట్టుకోండి అని రేవంత్‌ చాలాసార్లు అన్నాడు. ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్‌ అయినప్పుడు కూడా తన జేబులో ఉన్న డబ్బులు పోయినట్లు అందరికంటే ఎక్కువగా అల్లాడిపోయాడు. తిరిగి ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరుకున్నప్పుడు ఏకంగా సీజన్‌ టైటిల్‌ గెలిచేసినట్లు సంబరపడ్డాడు. తన మీద, తన అభిమానుల మీదున్న నమ్మకం అది!

మొదట్లో ఈ సీజన్‌ ట్రోఫీ ఎత్తేది నేనే అని రేవంత్‌ అన్నప్పుడు చాలామందికి విడ్డూరంగా అనిపించేది. కోపానికి, ఆవేశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఇతడు గెలవడమేంటని నవ్వుకున్నారు. కానీ నాగ్‌ అతడు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపినా, చూపకోయినా కోపాన్ని మాత్రం తగ్గించుకోమని పదేపదే హెచ్చరిస్తూ ఉండేవాడు. అయినా ఆవేశాన్ని అణచుకోకపోవడంతో ఏకంగా ఎల్లో కార్డ్‌ చూపించాడు. దెబ్బకు ఓ మెట్టు దిగిన రేవంత్‌ అందరినీ గుద్దిపడేస్తా అనే లెవల్‌లో కాకుండా తన జోలికొస్తే మాత్రమే ఊరుకోను అన్నట్లుగా కొంత కామ్‌ అయిపోయాడు. 

కానీ అప్పటివరకు గేమ్‌లో ఎంతోమందిని విసిరికొట్టాడు, నెట్టేశాడు, పడేశాడు, చాలా ఫిజికల్‌ అయ్యాడు. అంత క్రూరంగా గేమ్‌ ఆడేవాడు, కానీ అది గెలుపు కోసం మాత్రమే! అయితే రేవంత్‌లో ఉన్న ఓ గొప్ప లక్షణం ఏంటంటే కోపాన్ని ఎక్కువ సేపు కంటిన్యూ చేయడు. గొడవ అయిపోయాక దాన్ని మర్చిపోయి వెంటనే సారీ చెప్పి అవతలివాళ్లను అక్కున చేర్చుకుంటాడు. ఒకరకంగా ఇదతడికి మైనస్‌గానూ మారింది. అప్పటివరకు అంత ఆవేశపడ్డ వ్యక్తి సడన్‌గా సారీ చెప్తున్నాడంటే అది నటనా? నిజమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రానురానూ అతడి కోపం పాలపొంగు వంటిదని హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు అర్థమైంది.

ఇక ఫిజికల్‌ టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. నిద్రలో నుంచి లేపి టాస్కు ఆడమన్నా సిద్ధంగా ఉంటాడు. హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్‌ అయిన ఘనత కూడా ఇతగాడి పేరు మీదుంది. స్నేహానికి ఎంత విలువిస్తాడో ప్రత్యక్షంగా చూశాం. కాకపోతే రేవంత్‌లో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. రేషన్‌ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఎంతసేపూ సరుకులు అయిపోకుండా ఎలా వండాలి? అని ఆలోచించేవాడే తప్ప అవతలివాళ్ల ఆకలి తీరుతుందా? లేదా? అని అర్థం చేసుకునేవాడు కాదు. మా కడుపు నిండట్లేదు బాబోయ్‌, ఇంకాస్త వండండి అని చెప్పినా సరే పిడికెడంత బియ్యం కూడా ఎక్కువ పెట్టేవాడు కాదు. స్ట్రిక్ట్‌గా ఉండటంతో చాలామంది హౌస్‌మేట్స్‌ అతడిని వెనకాల తిట్టుకునేవారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. కొన్నిసార్లు రేవంత్‌ ఫుడ్‌ దాచుకుని తినేవాడు. ఇక ఆవేశంలో ఏం మాట్లాడతాడో అతడికే అర్థం కాదు. ఆ మాటలను తర్వాత మర్చిపోతుంటాడు కూడా!

మరి ఇన్ని మైనస్‌లున్నా విజేత ఎలా అయ్యాడంటారా? రేవంత్‌ చెప్పినట్లే అతడికి హౌస్‌లో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేదు. శ్రీహాన్‌ మొదట్లో ఓపెన్‌ అవడానికి, గేమ్‌ ఆడటానికి సమయం పట్టింది. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు టాస్కులు ఆడినప్పటికీ నామినేషన్స్‌లో అతడు చేసే వెటకారంతో విమర్శలపాలు కావాల్సి వచ్చింది. కానీ చివర్లో మాత్రం పుంజుకుని రేవంత్‌తో ఓటింగ్‌లో తలపడ్డాడు. ఆదిరెడ్డి.. ఎంతసేపూ రివ్యూలు ఇస్తూ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తూ అతిగా ఆలోచనల్లో గడిపేశాడు. కీర్తి.. ప్రతిచిన్నదానికీ హర్ట్‌ అవుతూ బాధపడటానికే ఎక్కువ సమయం వెచ్చించింది. మాటతో, ప్రవర్తనతో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకున్న రోహిత్‌ ఆటలో మాత్రం వెనకబడ్డాడు. ఇక ఫినాలేలో ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి డబ్బు తీసుకోకుండా చివరి క్షణం వరకు అలాగే నిలబడి ట్రోఫీ ఎగరేసుకుపోయాడు రేవంత్‌.

చదవండి: విన్నర్‌ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?
మరికొద్ది గంటల్లో పెళ్లి.. గ్రాండ్‌ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్‌ కంటెస్టెంటల​

మరిన్ని వార్తలు