Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌.. నీకోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ

4 Aug, 2022 20:43 IST|Sakshi

మన ఇంట్లో ముచ్చట్లు కొత్తగా వినేదేముంటుంది.. అదే పక్కింటి ముచ్చట్లు అయితే చెవులింతేసుకుని వింటారు. ఇక సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌, గాసిప్స్‌ అంటే.. చెవులు కొరుక్కుంటారు. మరి అలాంటి సెలబ్రిటీలను ఒకేచోట చేర్చి 100 రోజులపాటు టాస్కులాడించే గేమ్‌ షో వస్తుందంటే ఊరుకుంటారా? బిగ్‌బాస్‌.. నీ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ అనేలా ఎదురుచూపులతో కాలం గడిపేస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ తాజాగా బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ లోగో వదిలారు. లోగో చూస్తుంటే సృజనాత్మకంగానే డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా కింగ్‌ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌ ఎప్పటినుంచి ప్రారంభం అన్న వివరాలు ఇవ్వలేదు కానీ మరీ ఎక్కువ కాలం వెయిట్‌ చేయించకుండా త్వరలోనే వచ్చేస్తానంటోంది బిగ్‌బాస్‌. గతంలో వచ్చిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవగా ఈ ఆరో సీజన్‌ మాత్రం టీవీలోనే ప్రసారం కానుంది. సెప్టెంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఈ సీజన్‌ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. మరి బిగ్‌బాస్‌ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఈసారి ఏ రేంజ్‌లో ఉండబోతుంది? అన్న విషయాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!

చదవండి: అతడు డ్రగ్స్‌ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి

మరిన్ని వార్తలు