Bigg Boss 6 Telugu: పాతాళానికి పడిపోయిన బిగ్‌బాస్‌.. అన్నింటికంటే తక్కువ టీఆర్పీ

4 Jan, 2023 13:46 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజే వేరు. పక్కింటి ముచ్చట్లను చెవులు ఎక్కుపెట్టి వినే జనాలను ఆధారంగా చేసుకునే ఈ షో మొదలుపెట్టారు. వంద రోజులపాటు సెలబ్రిటీలను సోషల్‌ మీడియాకు, ఇంటికి దూరంగా ఓ ఇంట్లో ఉంచడం, వారు ఎలా ఉంటారో ప్రజలకు తెలియాలన్నదే షో కాన్సెప్ట్‌. ఇక్కడ జనాలు వారికి నచ్చినవారికి ఓటేస్తారు, నచ్చనివారిని బయటకు పంపించేస్తారు. అలా ఎంతమంది హౌస్‌లో అడుగుపెట్టినా చివరికి ఒక్కరే విజేతగా నిలుస్తారు.

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో శివబాలాజీ, నాని వ్యాఖ్యాతగా ఉన్న రెండో సీజన్‌లో కౌశల్‌ మండా, నాగార్జున బిగ్‌బాస్‌ పగ్గాలు చేతపట్టిన మూడో సీజన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, నాలుగో సీజన్‌లో అభిజిత్‌, ఐదో సీజన్‌లో వీజే సన్నీ, ఆరో సీజన్‌లో సింగర్‌ రేవంత్‌ గెలిచారు. మొదట్లో భారీ టీఆర్పీ రేటింగ్స్‌తో ఊపందుకున్న బిగ్‌బాస్‌కు రానురానూ ఆదరణ కరువైపోయింది. బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌కు వచ్చిన టీఆర్పీయే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఫస్ట్‌ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌కు 14.13, రెండో సీజన్‌ ఫినాలేకు 15.05, మూడో సీజన్‌ ఫినాలేకు 18.29, నాలుగో సీజన్‌ ఫినాలేకు 19.51, ఐదో సీజన్‌ ఫినాలేకు 16.04 టీఆర్పీ వచ్చాయి. రేవంత్‌ గెలుపొందిన ఆరో సీజన్‌ ఫినాలే ఎపిసోడ్‌ మాత్రం అతి దారుణంగా 8.17 టీఆర్పీతో సరిపెట్టుకుంది.

ఆరో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక దగ్గరి నుంచి ఏదీ బాలేదని మొదటి నుంచే నెటిజన్లు పెదవి విరిచారు. పైగా ప్రారంభ వారాల్లోనే రేవంత్‌ విన్నర్‌ అని అందరూ ఫిక్సయ్యారు. అతడికి హౌస్‌లో గట్టి పోటీనిచ్చేవారే కరువయ్యారు. ఎలాగో అతడే గెలుస్తాడని ప్రేక్షకులు కూడా ఫిక్సైపోయి ఫినాలేను పక్కనపెట్టేసినట్లున్నారు. ఏదేమైనా మిగతా ఐదు సీజన్లకు డబల్‌ డిజిట్‌ టీఆర్పీ వస్తే ఆరో సీజన్‌ మాత్రం కేవలం సింగిల్‌ డిజిట్‌తో సరిపెట్టుకుని తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే అట్టర్‌ ఫ్లాప్‌ సీజన్‌గా నిలిచింది.

చదవండి: పేదలకు నయన్‌ దంపతుల సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌
సమంత వండర్‌ఫుల్‌ లేడీ, తనను అమ్మలా కాపాడుకుంటా: రష్మిక

మరిన్ని వార్తలు