Bigg Boss 6 Telugu: ప్రైజ్‌మనీ కోత షురూ.. ఈసారైనా వీళ్లు కెప్టెన్‌ అవుతారా?

16 Nov, 2022 16:15 IST|Sakshi

ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని ఫీలైనట్లున్నాడు బిగ్‌బాస్‌. మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వండి, మీలో ది బెస్ట్‌ కంటెస్టెంట్‌కు అర కోటి ప్రైజ్‌మనీ ఇస్తానన్నాడు. కానీ ఎక్కడా? ఆదిరెడ్డి అన్నట్లు ఈ సీజన్‌లో ఎక్కువగా తుప్పాస్‌ కంటెస్టెంట్లే ఉన్నారు. బాగా ఆడి టీఆర్పీలు పెంచమంటే ఎవరికి వారు పిక్నిక్‌కు వచ్చినట్లు రిలాక్స్‌ అయ్యారు. దీంతో సీజన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఫలితంగా బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది. ఇంకేముంది.. ప్రైజ్‌మనీకి కత్తెర పెట్టే పనులు చేస్తున్నాడు. 

ఇప్పటికే నామినేషన్స్‌లో ఒకరిని సేవ్‌ చేయడం, బిగ్‌బాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ ఓడిపోవడంతో ప్రైజ్‌మనీ రూ.50 లక్షల నుంచి రూ.44,00,300కి చేరింది. తాజాగా బిగ్‌బాస్‌ కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా డబ్బులతో ముడిపెడుతూ మీ అర్హతను కొనుక్కోమన్నాడు. ఐదో సీజన్‌లో పెట్టిన ట్రక్కు టాస్క్‌ను కొద్దిగా అటూఇటూ మార్చి మళ్లీ అదే టాస్క్‌ ప్రవేశపెట్టాడు. ఈ గేమ్‌లో ఇనయ, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, రేవంత్‌, రోహిత్‌ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో ఇనయ, రోహిత్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవనేలేదు. మరి ఈసారైనా వీరికి ఛాన్స్‌ వస్తుందేమో చూడాలి! ఇకపోతే ఈ టాస్క్‌ విలువ రెండు లక్షలని తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌ గెలిచి ప్రైజ్‌మనీని కాపాడుకున్నారా.. మరో రెండు లక్షలు పోగొట్టుకున్నారా? తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: ఇంటి అద్దె కట్టలేక కష్టాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు: ఫైమా
బిగ్‌బాస్‌ 6 విన్నర్‌ తానే అని గాల్లో తేలిపోతున్న ఆదిరెడ్డి

మరిన్ని వార్తలు