Bigg Boss 6 Telugu: మధ్యలో దూరడం బాగా అలవాటైంది..ఆదిరెడ్డిపై నాగ్‌ ఫైర్‌

10 Sep, 2022 18:40 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షో అభిమానులకు శని, ఆదివారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ రోజు హోస్ట్‌ నాగార్జున వచ్చి వారంలో కంటెస్టెంట్స్‌ చేసిన తప్పులపై క్లాస్‌ తీసుకుంటాడు. అంతేకాదు వాళ్లతో ఫన్నీ గేమ్స్‌ ఆడించి, చివరకు ఒకరిని హౌస్‌లో నుంచి బయటకు పంపుతాడు. అందుకే ఈ రెండు రోజుల కోసం ‘బిగ్‌బాస్‌’ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఇక బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో తొలి వీకెండ్‌ డే రానే వచ్చేసింది. నేడు(శనివారం) హోస్ట్‌ నాగార్జున వచ్చి ఇంటి సభ్యుల పంచాయితీపై తన తీర్పుని ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

(చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం మానేశాను : వీజే సన్నీ)

ఇందులో గీతు, ఆదిరెడ్డి, రేవంత్‌లకు గట్టి క్లాస్‌ పీకాడు హోస్ట్‌ నాగార్జున. బిగ్‌బాస్‌ కంటెసెంట్స్‌ నా ఫ్యామిలీ మెంబర్స్‌ కాలేరన్న గీతూకి తనదైన శైలీలో కౌంటర్‌ ఇచ్చాడు. ఇక హౌస్‌లో బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నావని రేవంత్‌కి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. రోహిత్‌, మెరీనా జంటల మధ్య ఏర్పడిన వివాదానికి తెరదించాడు. మెరీనాని దూరం పెట్టాల్సిన అవసరం లేదని, నీకు అల్రెడీ లైసెన్స్‌(పెళ్లి) ఉందని, అందరి ముందు హగ్‌ చేసుకోవచ్చని చెప్పడమే కాకుండా.. అందరి ముందు టైట్‌ హగ్‌ ఇవ్వాలని కోరాడు.

ఆరోహి,రేవంత్ గొడవ గురించి మాట్లాడుతూ..‘ఓడిపోయిన బాధలో వెనక్కొచ్చిన ఆరోహిని ఆ మాట అనడం అవసరమా? అని రేవంత్‌ని నిలదీశాడు. ఆమె క్షమాపణలు చెప్పడానిని వచ్చినప్పుడు మధ్యలో దూరిన గీతూ, ఆదిరెడ్డిలను కూడా గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. వాళ్లకి(గీతూ, ఆదిరెడ్డి) రివ్యూలు చేసి చేసి మధ్యలో దూరడం అలవాటైందని నాగ్‌ సీరియస్‌ అయ్యాడు. హౌస్‌మేట్స్‌తో నాగార్జున ఇంకా ఏమేమి పనులు చేయించాడు? వారి మధ్య ఉన్న వివాదాలను ఎలా పరిష్కరించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు