Bigg Boss 6 Telugu: రేవంత్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించిన ఆ ఇద్దరు!

28 Nov, 2022 23:53 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంది. అటు రాజ్‌ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదవాల్సిందే!

నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్‌ మీద సీరియసయ్యాడు శ్రీహాన్‌. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్‌ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్‌ వెళ్లిపోయాడని ఏడ్చేసింది.

గతవారం రేవంత్‌ రేషన్‌ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్‌. ఇక మీదటైనా ఆహారం వేస్ట్‌ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌. అనంతరం ఇంట్లో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారంటే..
► 
ఆదిరెడ్డి.. రేవంత్‌, రోహిత్‌
► ఫైమా.. రేవంత్‌, రోహిత్‌
► శ్రీహాన్‌.. రోహిత్‌, ఆదిరెడ్డి
► కీర్తి.. రేవంత్‌, శ్రీసత్య
​​​​​​​► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి
​​​​​​​► రోహిత్‌.. ఆది రెడ్డి, ఫైమా
​​​​​​​► రేవంత్‌.. ఆది రెడ్డి, ఫైమా
​​​​​​​► ఇనయ.. రేవంత్‌, శ్రీసత్య

ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్‌ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్‌ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్‌ మాత్రం నాగ్‌ సర్‌ ఆల్‌రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు.

అటు ఫైమా - రేవంత్‌, శ్రీహాన్‌ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్‌ మామూలుగా జరగలేదు. 'రోహిత్‌ స్ట్రాంగ్‌ అని నామినేట్‌ చేస్తున్నావ్‌, అంటే నువ్వు వీక్‌ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్‌ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్‌. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్‌ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌, కీర్తి నామినేట్‌ అయ్యారు.

​​​​​​​

చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం
బిగ్‌బాస్‌: రాజ్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే?

మరిన్ని వార్తలు