Bigg Boss6: కంటెస్టెంట్స్‌ ఆట తీరుపై నాగ్‌ ఫైర్‌.. షానీకి సాదాసీదా వీడ్కోలు!

18 Sep, 2022 09:25 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో మొదటి వారం కూల్‌గా ఉండి కంటెస్టెంట్స్‌తో సరదాగా ఆటలు ఆడించిన హోస్ట్‌ నాగార్జున..రెండో వారం మాత్రం ఫుల్‌ ఫైర్‌ అయ్యాడు. మీరంతా టైంపాస్‌కి, రిలాక్స్‌ అవ్వడానికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చారా? అంటూ కంటెస్టెంట్స్‌పై మండిపడ్డాడు. అంతేకాదు ఆట ఆడకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండలేరని వార్నింగ్‌ ఇచ్చాడు. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడమే మీ ప్రధాన కర్తవ్యం అని ఇంటి సభ్యులకు హితబోధ చేశాడు. చివరకి ఇంటి నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించాడు.

హాలులో కూర్చున్న 20 మంది కంటెస్టెంట్స్‌లో బాలాదిత్య, షానీ, వాసంతి, సుదీప, శ్రీసత్య, రోహిత్‌ అండ్‌ మెరీనా, అభినయ, కీర్తి, శ్రీహాస్‌లను సోఫా బయట నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక్కోక్కరి ఆట తీరుని వివరిస్తూ గట్టి క్లాస్‌ తీసుకున్నాడు. మొదటగా ఫైమా ఆట తీరు గురించి మాట్లాడుతూ..  నీ ఆట బాగుందని అనుకుంటున్నావా? అని అడిగాడు. అప్పుడు ఫైమా నేను బాగానే ఆడుదాము అనుకున్నాను కానీ నా కాలు సహకరించలేదు. అందుకే ఆడలేకపోయాను అని చెప్పగా...‘నీ కాలు కాదు నీ మైండ్‌ పనిచేయడం లేదు’అని నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. నువ్ గెలవడానికి ఆడతావా లేదా పక్కన వాళ్లని ఓడించడానికా? రేవంత్‌కు నువ్ సాయం చేయకపోయినా.. రేవంత్ నీకు సాయం చేశాడు.సంచాలక్‌గా రేవంత్‌ నిన్ను టాస్క్‌ నుంచి డిస్‌క్వాలిఫై చేస్తే బాధెందుకు? సంచాలక్‌గా రేవంత్‌ తప్పుచేశాడా? నిన్ను గెలిపించిన వ్యక్తి నిన్ను ఎందుకు తప్పిస్తాడు? నీ ఆట తీరు బాగాలేదు. నువ్వు ఆడుతుంటే మాకు ఒక పులి కనబడాలి. స్ట్రాటజీ పేరుతో నిన్ను నువ్వు ​ మోసం చేసుకోకు’అని నాగ్‌ సూచించాడు.

చంటి గురించి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్‌ అనేది ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా? ఎందుకు అంత ఈజీగా తీసుకున్నావ్‌? కెప్టెన్సీ టాస్క్‌ అంటే ఇమ్యునిటీ అనేది నీకు అర్థం కాలేదా? నువ్వు చేస్తున్న కామెడీ బాగుంది. కానీ నీ ఆటతీరు మాత్రం ఎక్కడో లోతులో నూతిలో ఉంది. నవ్వించడమే కాదు ఆట కూడా బాగా ఆడాలి’అని క్లాస్‌ పీకాడు.

సూర్య నీకు బయట చాలా పనులు ఉంటాయి కదా? యాక్టింగ్‌,రైటింగ్‌..ఇలా ఫుల్‌ బిజీగా ఉంటావ్‌ కదా? ఏంటి మా బిగ్‌బాస్‌ హౌస్‌కి చిల్‌ అవ్వడానికి వచ్చావా? హాలిడేలాగా ఉందా? అందరికి కావాల్సింది వండేస్తే చాలు మార్కులు పడిపోతాయి అనుకుంటున్నావా? బిగ్‌బాస్‌ ఆట అంత సింపుల్‌ కాదు.నీకు వచ్చిన అవకాశం కోసం నువ్వు పోరాటం చేయకపోతే మళ్లీ నీకు ఆ అవకాశం రాదు. అప్పుడు నువ్వు చిల్‌ కావొచ్చు అని చురకలు అంటిచాడు.

రేవంత్ గురించి చెబుతూ..  కోపం తగ్గించుకున్నావ్ కానీ పక్కన వాళ్లకి సలహాలు, నీతులు చెప్పకు. నువ్వేమైనా తోపువా? బొట్టు పెట్టుకుంటే.. నచ్చుతారు.. ఇలా తయారవ్వాలి.. మనుషులు ఇలా ఉండాలి.. అని చెబుతున్నావ్.. అందరినీ కరెక్ట్ చేయడం ఆపేయ్.. నిన్ను నువ్ కరెక్ట్ చేసుకో.. నీ స్నేహితులతో చేసే ఫన్ బాగుంటుంది కానీ దానికిఒక హద్దు ఉంటుంది. అందరినీ దగ్గరకు చేసుకుందామని వచ్చావ్.. దూరం చేసుకోవడానికి కాదు.వాళ్లు దగ్గరైతే మా ఆడియన్స్‌ కూడా దగ్గరవుతావు. లాస్ట్‌ వీక్‌ ఆట మాత్రం ఇరగదీశావ్.. కసి ఉంది కదా? కంటిన్యూ చేయ్.. కోపం తీసేయ్.. కసి ఉంచు. నిన్వు ఓడించిన వ్యక్తి(ఫైమా) కోసం ఆడి ఆమెను గెలిపించావ్‌ చూడు..దానితో నీ గ్రోత్‌ పెరిగిపోయింది’అని నాగ్‌ అన్నాడు.

నేహా..  స్పోర్ట్స్‌లో ఎన్ని గాయాలు తగులుతాయో తెలుసు కదా? బిగ్‌బాస్‌ షో అంటే నీకు చులకనా? ఇనయా, ఫైమా, రేవంత​లకు కూడా నీలాగే దెబ్బలు తగిలాయి. వాళ్లు ఆడలేదా? వచ్చేవారం నుంచైనా నవ్వు బాగా ఆడాలి అని నాగ్‌ సూచించాడు. అర్జున్ నువ్ మాత్రం.. రేవంత్ నా గురించి అదన్నాడు.. ఇదన్నాడు.. తప్పా.. ఇంకేం ఆడటం లేదు.. వారంలో ప్రతీ రోజూ పడుకునే ఉన్నావ్.. కూర్చుని కంప్లైంట్ చెప్పడానికి వచ్చావా?.. గేమ్ మీద దృష్టి పెట్టు అని గడ్డిపెట్డాడు.

ఆరోహి నువ్వు ఒక్కోసారి బ్రెయిన్ వాడతావు.నలుగురు ఆడపిల్లలు కలిసి ఆడినప్పుడు మన టార్గెట్ అర్జున్‌ అని చెప్పి అతన్ని రింగ్‌ నుంచి బయటకు తోశావ్‌ కదా?. మరి అదే విషయాన్ని రేవంత్ అంటే ఎందుకు ఎమోషనల్ అయ్యావ్? నీ ఆటకు నువ్ 70 మార్కులు ఇచ్చుకున్నావ్.. నేను 50 మార్కులే ఇస్తా’అని నాగ్‌ అన్నాడు

గీతూపై నాగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఆమె ఆటకు వందకు రెండువందల మార్కులు ఇస్తానని చెప్పగా.. ‘మీరు చూసింది 20 శాతం.. ఇంకా భయంకరంగా ఉంది సర్‌’ అని గీతూ అంది.అవునా.. మరి ఎందుకమ్మా నీ బొమ్మను కాపాడుకోలేకపోయావ్‌ అని కౌంటర్‌ ఇచ్చాడు. తాడిని తన్నేవాడు ఒకడుంటే.. తలను తన్నేవాడుంటాడు.. అని రేవంత్ చెప్పిన డైలాగ్ గుర్తు చేస్తాడు.

ఇనయ.. ఆటలోకి వచ్చావ్.. బాగా ఆడావ్.. మనుషుల సపోర్ట్ లేదని బాధపడకు.. అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. రాజ్.. నువ్ అడుక్కుని కెప్టెన్ అయ్యావ్.. కెప్టెన్ అయిన తీరు కరెక్ట్ కాదు. జాలి కరుణతో అయ్యావ్.. ఓడినా పర్లేదు.. గెలుపు అడుక్కుంటే బాగుండదు.. సెల్ఫ్ సింపతీ వర్కౌట్ కాదు.. నీలో శక్తి ఉంది.. ఇక వేళ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటే కెప్టెన్‌గా వచ్చే వారం ఏం ప్రూవ్ చేసుకుంటావో చూస్తాం’అన్నాడు

ఇక మిగిలిన తొమ్మింది మందిలో ఎవరు వేస్ట్ అనేది ఓటింగ్‌ ద్వారా చెప్పమని మిగతా 11 మంది కంటెస్టెంట్స్‌ని కోరాడు నాగ్‌. వారిలో శ్రీసత్య, వాసంతి, షానీలకు మూడు మూడు ఓట్లు పడ్డాయి. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్, ఆడియెన్స్ ఓటింగ్‌లతో మ్యాచ్ అయిందని షానీని ఎలిమినేట్ చేశారు. అయితే అతన్ని గత సీజన్ల మాదిరిగా కాకుండా సాదాసీదాగా బయటకు పంపించారు. స్టేజ్ మీద అతని జర్నీ వీడియోను చూపించలేదు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడించలేదు. ఒక టాస్క్‌ ఇవ్వలేదు. అతని అనుభవాలను పంచుకోనివ్వలేదు. చాలా సింపుల్‌గా హౌస్‌ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అయ్యే రెండో వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. తాజా సమాచారం ప్రకారం..అభినయశ్రీ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు