Bigg Boss 6: అందుకే ‘నారాయణ నారాయణ’ అన్నాను : నాగార్జున

14 Sep, 2022 11:42 IST|Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ దిగ్విజయంగా రన్‌ అవుతోంది. ఈ షో ఎంత సక్సెస్‌ అవుతుందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జునను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక బిగ్‌బాస్‌ షోని మొదటి నుంచి విమర్శిస్తున్న సీపీఐ నాయకుడు నారాయణ..తాజాగా మరోసారి బిగ్‌బాస్‌ షో, హోస్ట్‌ నాగార్జునపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అని, డబ్బు కోసమే నాగార్జున ఇదంతా చేస్తున్నాడని విమర్శించాడు.

అయితే దీనిపై నాగార్జున ప్రత్యేక్షంగా మాత్రం స్పందించలేదు.  కానీ... శనివారం ఎపిసోడ్‌లో భాగంగా  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ... హౌస్ లో ఉన్న భార్యాభర్తలు మెరీనా, రోహిత్‌లను హగ్‌ చేసుకోమని అడిగారు. వాళ్లు హగ్‌ చేసుకొని ముద్దు ఇవ్వగానే.. నవ్వుతూ ‘నారాయణ.. నారాయణ.. వాళ్లు పెళ్లయినవాళ్లు' అని అన్నారు. దీంతో నారాయణపై నాగార్జున సెటైర్‌ వేశాడని వార్తలు పుట్టుకొచ్చాయి.

(చదవండి: కెమెరా ముందు రోహిత్‌, మెరీనా రొమాన్స్‌)

దీనిపై నాగార్జున కూడా స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎవరైనా జోక్‌ వేస్తే నేను ‘నారాయణ నారాయణ’ అంటాను. శనివారం ఎపిసోడ్‌లోనూ నవ్వించడానికే అలా అన్నాను. బిగ్‌బాస్‌ గత రెండు సీజన్స్‌లోనూ ఇదే ఉంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ‘నారాయణ నారాయణ’ అని అనడం లేదు’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇంకా బిగ్‌బాస్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌’లో ఎవరు డ్రామా చేస్తున్నారు? ఎవరు గేమ్స్‌ ఆడుతున్నారు? అని విశ్లేషించుకుంటుంటే నాకు లైఫ్‌ లెసెన్స్‌లా అనిపిస్తోంది. మన కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య సమయం గడపడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఓ పార్టిసిపెంట్‌గా ‘బిగ్‌బాస్‌’లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు’అని నాగార్జున అన్నాడు.

మరిన్ని వార్తలు