Bigg Boss 6 Telugu: మచ్చలేని మనిషి, నిజాయితీకి నిలువెత్తు రూపమంటూ రోహిత్‌పై ప్రశంసలు

2 Dec, 2022 15:47 IST|Sakshi

ఏకాభిప్రాయం అనే ఒకే ఒక్క మాటతో హౌస్‌మేట్స్‌ను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్‌. ఇంత దూరం వచ్చాక కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా మీలో మీరు కొట్టుకు చావండి, కానీ మీలో కొందరినే గేమ్‌ ఆడేందుకు సెలక్ట్‌ చేసుకోమనడంతో కంటెస్టెంట్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే టికెట్‌ టు ఫినాలే రేసులో ఇనయ, శ్రీసత్య, కీర్తి గేమ్‌ నుంచి అవుట్‌ అయ్యారు.

మిగిలిన ఐదుగురిలో ఏ ముగ్గురు నెక్స్ట్‌ ఛాలెంజ్‌ ఆడతారో ఏకాభిప్రాయానికి వచ్చి వారి పేర్లు చెప్పమన్నాడు బిగ్‌బాస్‌. ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్‌ బోర్డులో టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను తొలగించి రేవంత్‌, ఫైమా, రోహిత్‌ ఆడతారని వెల్లడించింది. ఇది విన్న ఆదిరెడ్డి ఈ సీజన్‌లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదేనని ఫైరయ్యాడు.

ఈ గొడవంతా ఎందుకనుకున్న రోహిత్‌ తాను ఆట నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానన్నాడు. గేమ్‌ ఆడాలి కానీ ఫెయిర్‌గా కూడా ఆడాలి అంటూ రోహిత్‌ మిగతావారికి ఛాన్స్‌ ఇస్తూ సైడ్‌ అయిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రోహిత్‌ ఆటలో గాని మాటలోగాని మచ్చలేని మనిషి అని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: విర్రవీగుతున్న రేవంత్‌, తప్పు చేసి అవతల వాళ్లను నిందించటమే పని!
తండ్రయిన సింగర్‌ రేవంత్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు