Bigg Boss 6:ఎలిమినేషన్‌లో కొత్త ట్విస్ట్‌.. ఆ కారణంతో వాళ్లను సేవ్‌ చేసిన బిగ్‌బాస్‌!

11 Sep, 2022 23:00 IST|Sakshi

లీకుల వీరుల ముందు మళ్లీ బిగ్‌బాస్‌ ఓడాడు. ఎలిమినేషన్‌ ప్రక్రియను చాలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్న బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు. లీకుల వీరులు చెప్పినట్లుగానే ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లలేదు. నామినేషన్‌లో ఉన్న ఏడుగురిని సేవ్‌ అయ్యారు. 

సండే అంటే ఫన్‌డే. ఆటలు.. పాటలు.. మధ్యలో ఎలిమినేషన్‌ అంటూ ఆదివారం ఎపిసోడ్‌ని మొదలు పెట్టాడు నాగార్జున. చెప్పినట్లుగానే ఇంటి సభ్యులతో వెరైటీ గేమ్స్‌ ఆడించారు. ముందుగా ‘ఎవరికి ఎంత తెలుసు’ అనే ఆట ఆడించాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యుల గురించి ప్రశ్నలు  అడిగాడు.  ‘శ్రీహాన్‌ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు’.? ‘ఆర్‌జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు.? శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటులు ఉన్నాయి? లాంటి ఫన్నీ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌తో ఈ గేమ్‌ ముగిసింది.

అయితే ఈ గేమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు జవాబు చెప్పి బాలాదిత్య ‘స్టార్‌ ఆఫ్‌ ది వీక్‌’గా నిలిచాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ నుంచి ప్రత్యేకమైన బహుమతిని కూడా పొందాడు. ఇక నామినేషన్‌లో ఉన్న ఐదుగురి చెతికి ఓ బ్యాటిన్‌ ఇచ్చి అది ఓపెన్‌ చేయమని చెప్పాడు హోస్ట్‌ నాగార్జున. అందులో బ్లూ కలర్‌ వస్తే సేఫ్‌ అని చెప్పగా.. అభినయశ్రీ, రేవంత్‌, ఆరోహి, ఫైమా, ఇనయాలలో ఫైమా సేవ్‌ అయింది. 

 

ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో ‘ఐటమ్‌ నంబర్’గేమ్‌ ఆడించాడు. హోస్ట్‌ నాగార్జున ఓ వస్తువును చూపిస్తే.. ఆ వస్తువుతో వచ్చే పాట ఏంటో కంటెస్టెంట్స్‌ గెస్‌ చేయాలి. ఇందుకుగాను ఇంటి సభ్యుల్ని  ఏ, బీ అనే టీమ్‌లుగా విభజించాడు. ఏ టీమ్‌లో చంటి, శ్రీసత్య, రేవంత్‌,నేహా, అభినయ, అర్జున్‌, మెరీనా అండ్‌ రోహిత్‌, కీర్తి, షానీ, ఇనయా  ఉండగా.. మిగతావాళ్లు బీ టీమ్‌లో ఉన్నారు. ఈ ఆటలో మొదటి నుంచి ముందంజలో ఉన్న ఏ టీమ్‌ సభ్యలు విజయం సాధించారు.

ఇక గేమ్‌ మధ్యలో రేవంత్‌ సేవ్‌ అయినట్లు వెల్లడించారు. ఇక చివరగా నామినేషల్‌లో ఉన్న ఆరోహి, ఇనయా, అభినయ శ్రీను నిలబెట్టి.. వారిపై ఏదైనా కంప్లైట్స్‌ ఉంటే చెప్పండి అని మిగిలిన కంటెస్టెంట్స్‌ని అడిగాడు నాగార్జున. అప్పుడు ఒక్కొక్కరు లేచి వారిపై తమకున్న కంప్లైంట్‌ ఏంటో వివరించారు. అయితే ఇందులో  ఎక్కువమంది(14) ఇనయా సుల్తానాపైనే కంప్లైంట్‌ చేశారు. దీంతో ఇనయా బెడ్‌రూమ్‌లోకి కాసేపు ఏడ్చింది. మిగిలన సభ్యులు ఆమెను ఓదార్చి తీసుకొచ్చారు. అనంతరం ఆరోహిని సేవ్‌ అయినట్లు ప్రకటించారు.

ఇక చివరగా అభినయశ్రీ, ఇనయా సుల్తానాను గార్డెన్‌ ఏరియాలో ఉన్న సుత్తిని ఎత్తాలని చెప్పాడు నాగార్జున. ఇద్దరిలో ఎవరు సుత్తిని ఎత్తగలరో వారే సేఫ్‌ అవుతారని చెప్పాడు. అయితే అనూహ్యంగా ఇద్దరు తమ దగ్గర ఉన్న సుత్తిని ఎత్తారు. దీంతో ఇద్దరు సేవ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. హౌస్‌లోకి వచ్చి వారమే అవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ సెటిల్‌ అవుతున్నారు. అందుకే ఈ వారం ఎలిమినేష్‌ లేదు అని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్స్‌ అంతా హ్యాపీగా ఫీలయ్యారు.

మరిన్ని వార్తలు