Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ రెండోవారం ఇంటి కెప్టెన్‌ అతడే.. కొట్టేసుకుందాం అన్న గీతూ

17 Sep, 2022 08:59 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో రెండోవారం ఇంటి కెప్టెన్‌ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్‌ కోసం సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించి వారికి  టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారన్నది బిగ్‌బాస్‌-6 పదమూడో ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేద్దాం. 

బిగ్‌బాస్‌ రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా రాజ్‌ కెప్టెన్‌గా నిలిచాడు. ఈవారం ఎలిమినేషన్‌లో ఉండటం రాజ్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ కెప్టెన్సీ టాస్క్‌ అతనికి ఏమైనా హెల్ప్‌ అవుతుందని భావించిన ఇంటిసభ్యులు అతనికే ఏకాభిప్రాయంతో ఓట్లేశారు. అయితే ఇంత కష్టపడినా తనకు ఒక్కరు కూడా ఓటు వేయలేదంటూ ఇనయా తెగ ఫీల్‌ అయిపోయింది. చివరికి అత్యదిక ఓట్లతో రాజ్‌ కెప్టెన్సీ కుర్చీపై కూర్చొని ఇంటి సభ్యల కోసం ఏదైనా పనిష్మెంట్‌ వస్తే అది తానే తీసుకుంటానంటూ వాగ్ధానం చేస్తాడు.

ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రమోషన్స్‌ కోసం సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. పాపులర్‌ డైలాగులను తమ స్టైల్‌లో చెప్పాలంటూ టాస్కులు ఆడించారు. ఇందులో రేవంత్‌ మొదటగా పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్‌ చెప్పాడు.

ఆ తర్వాత గీతూ వచ్చి తమిళ్‌ ఏంటి? తెలుగేంటి? డార్లింగ్.. గొడవైంది, కొట్టేసుకుందాం రా అంటూ తన స్టైల్‌లో చెప్పి సూపర్‌ అనిపించింది. అంతేకాకుండా ఇదే డైలాగ్‌ను చిన్నపిల్లల వాయిస్‌లో చెప్పి ఆశ్చరానికి గురిచేసింది. ఇక ఈ టాస్కులో సత్య, రాజ్‌, శ్రీహాన్‌లు చేసిన ఓ స్కిట్‌ ఆకట్టుకుంది. ఇక చివర్లో సత్యను బెస్ట్‌ యాక్ట్రెస్‌గా, శ్రీహాన్‌కు బెస్ట్‌ యాక్టర్‌గా ప్రకటించి అవార్డులు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు