Keerthi Bhat Breakup Story: ఇండస్ట్రీకి వచ్చేందుకు ఏం చేశానోనని అనుమానించాడు..

21 Dec, 2022 18:07 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది కీర్తి. డబ్బులు ఎర చూపినా సరే వద్దంటూ అభిమానులు తనను ఏ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారో ఆ స్థానానికే కట్టుబడి ఉంటానంది. అలా మూడో స్థానంలోనే హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. తనకంటూ ఎవరూ లేరని బాధపడుతున్న కీర్తికి బిగ్‌బాస్‌ షో ద్వారా ఎంతోమంది అభిమానులయ్యారు. ఆమెను తెలుగింటి అమ్మాయిగా, ఇంట్లో కూతురిగా స్వీకరించారు. కానీ ప్రేమించిన వ్యక్తి మాత్రం తన ఎదుగుదలను అనుమానించి మధ్యలోనే వదిలేశాడు.

తన బ్రేకప్‌ గురించి కీర్తి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఒకతడిని ప్రేమించాను. ఇద్దరం బానే ఉండేవాళ్లం. కానీ ఓ పరిస్థితిలో అతడు నాకు బ్రేకప్‌ చేసి వదిలేశాడు. అంటే.. నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు కదా. నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చానో అన్న అనుమానంతో వదిలేశాడు. ఇక్కడిదాకా వచ్చిందంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గరివాళ్లే చులకనగా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది. అతడికి అలా అనిపించిందంటే నేను తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్లే.. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే మళ్లీ ఏడ్చుకుంటూ ఉండిపోతాను. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. త్వరలోనే మళ్లీ ఓ పాపను దత్తత తీసుకుంటాను' అని చెప్పింది.

చదవండి: నా కూతురికి ఆమె పేరే పెట్టుకున్నాను: అలీ
హిట్‌ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

మరిన్ని వార్తలు