Bigg Boss 6 Telugu: క్లోజ్‌ ఫ్రెండ్‌కు శ్రీహాన్‌ వెన్నుపోటు, రేవంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌!

10 Nov, 2022 16:01 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఆట అంటే ప్రాణం పెట్టి ఆడేవాళ్లలో సింగర్‌ రేవంత్‌ ముందువరుసలో ఉంటాడు. తనమన బేధాలు పక్కనపెట్టి గెలుపే తన లక్ష్యంగా పోరాడుతుంటాడు. ఒకరికి నేను ఎదురెళ్లినా వారికే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు అన్న రేంజ్‌లో గేమ్‌ ఆడతాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే కొన్నిసార్లు అవతలి హౌస్‌మేట్స్‌ను నెట్టేసి, కొట్టేసినంత పని చేశాడు. దీంతో నాగార్జున గేమ్‌ ఆడాలి కానీ అంత ఫిజికల్‌ అవకూడదని హెచ్చరిస్తూనే రేవంత్‌కు ఎల్లో కార్డ్‌ ఇచ్చాడు. ఇంకోసారి ఫిజికల్‌ అయితే నేరుగా బయటకు పంపిస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు.

ఈ దెబ్బతో రేవంత్‌ ఓ మెట్టు తగ్గక తప్పలేదు. కానీ దీన్నే తమ అస్త్రంగా మలుచుకున్నారు మిగతా హౌస్‌మేట్స్‌. స్నేక్‌ అండ్‌ లాడర్‌ టాస్క్‌లో పాము టీమ్‌ సభ్యులు అతడి వీక్‌నెస్‌ మీద దెబ్బ కొట్టాలనుకున్నారు. అతడు చేయి పట్టుకున్నా, లాగినా, వదిలించుకున్నా, ఆఖరికి కన్నెత్తి చూసినా సరే ఫిజికల్‌ అవుతున్నావు అని పదే పదే అరవడంతో రేవంత్‌ సైడ్‌ అయిపోయాడు. నేనేం చేయకపోయినా ఫిజికల్‌ అవుతున్నానని నిందలు వేస్తున్నారని అప్‌సెట్‌ అయ్యాడు. చివరికి గేమ్‌ అయిపోయాక టాస్క్‌లో కావాలని రెచ్చగొట్టామని వారు క్లారిటీ ఇవ్వడంతో అతడు మరింత బాధపడ్డాడు. ఇప్పటికే ఎల్లో కార్డ్‌ వచ్చిన బాధలో ఉంటే నా వీక్‌నెస్‌తో ఆడుకున్నారని తనలో తనే మధనపడ్డాడు. దీనికి తోడు శ్రీహాన్‌ చేసిన పనికి కూడా అతడు హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది.

గతవారం గీతూ పనిష్మెంట్‌ సరిగా చేయకపోవడంతో ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న శ్రీహాన్‌కు నాగార్జున ఓ పనిష్మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! ఈ వీక్‌ కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేయలేవని స్పష్టం చేశాడు నాగ్‌. అయితే స్నేక్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌లో పాము టీమ్‌ విజయం సాధించింది. ఇందులో శ్రీహాన్‌ కూడా ఉన్నాడు. అతడు కెప్టెన్సీ కంటెండర్‌ కాలేనందున అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోమన్నాడు. దీనికతడు గేమ్‌లో ఎంతో కష్టపడ్డ రేవంత్‌ను పక్కనపెట్టి ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్‌గా ఉన్న శ్రీసత్యను ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే గతంలో రేవంత్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిచేసుకుని తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఒక్క ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు రేవంత్‌. అందుకోసం బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రతి గేమ్‌లో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అతడికి ఛాన్స్‌ ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు శ్రీహాన్‌ తన పేరు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. శ్రీసత్య ఈవారమే కెప్టెన్‌ అయినందున తనకు ముందు వారాల్లో ఛాన్స్‌ ఇవ్వాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉంటూ బెస్ట్‌ ఫ్రెండ్‌కే వెన్నుపోటు పొడిచాడని రేవంత్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అతడు తన స్నేహితులెవరో తెలుసుకుంటే బాగుండని కామెం‍ట్లు చేస్తున్నారు. హౌస్‌మేట్స్‌ అంతా టార్గెట్‌ చేయడం ఒక ఎత్తయితే క్లోజ్‌ ఫ్రెండ్‌ తనను లెక్క చేయకపోవడం మరో ఎత్తు అని, అందుకే రేవంత్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడని భావిస్తున్నారు. అటు శ్రీహాన్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఒకేసారి న్యాయం చేయలేడు కదా, ఎవరికో ఒకరికి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు కదా, అది సరిపోదా? అని వెనకేసుకొస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్‌
కంట్రోల్‌ తప్పిన రోహిత్‌, బ్యాగును తన్నుతూ ఫైర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు