Bigg Boss Telugu 6: రేవంత్‌ను ఆడుకున్న నాగ్‌, అర్జున్‌కు సారీ చెప్పి ఏడ్చేసిన సింగర్‌

22 Oct, 2022 23:58 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 49: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎవరు గెలిచే ఆస్కారం ఉందన్న ప్రశ్నకు ఈరోజు ఎపిసోడ్‌ కొంచెం క్లూ ఇచ్చినట్లైంది. ఇంట్లో ఉండేందుకు ఎవరికి ఎక్కువ అర్హత ఉంది? ఎవరు అసలు ఉండాల్సిన అవసరమే లేదు? చెప్పాలని గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఈ క్రమంలో ఊహించని పేర్లు డిజర్వ్‌ కేటగిరీలోకి రావడం విశేషం. మరి ఎవరు ఏ జాబితాలో ఉన్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే పప్పు గొడవను ప్రస్తావించాడు. అంటే ఈరోజు రేవంత్‌కు గట్టిగానే వాయింపులు ఉంటాయని హింటిచ్చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది? అని శ్రీసత్యను అడిగాడు నాగ్‌. ఫ్రెండ్స్‌  ఉన్నప్పుడు వాళ్లు ఏమనుకున్నా ఓకే, కానీ గేమ్‌లో ఉన్నప్పుడు అతడిని నువ్వు ఉండ్రా పప్పు అని చిన్నచూపు చూడటం తప్పు. అందరిముందు అలా అనేసరికి అర్జున్‌ నువ్వేం మాట్లాడవా? అని అడిగానంది. మరి సత్య స్టాండ్‌ తీసుకునేదాకా నువ్వెందుకు గొడవపడలేదని అర్జున్‌ను నిలదీశాడు నాగ్‌. దానికతడు అది సరైన సమయం కాదేమోనని మొదట గొడవకు దిగలేదన్నాడు.

రేవంత్‌ మాట్లాడుతూ.. అలా అందరి ముందు అనడం తప్పు, కానీ చనువుతోనే ఆ మాట అన్నానని రేవంత్‌ తన మాటకు అర్థవివరణ ఇచ్చాడు. దీంతో నాగ్‌.. పప్పు, పకోడి, దొబ్బేయ్‌.. ఇలా ఏది పడితే అది అనకూడదు అని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. ఇక నాగ్‌.. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హులెవరు? అనర్హులెవరు? అనేది కంటెస్టెంట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా కన్ఫెషన్‌ రూమ్‌లోకి వచ్చిన శ్రీహాన్‌.. గీతూ అర్హురాలు, రోహిత్‌ అనర్హుడు అని చెప్పాడు.

మెరీనా, వాసంతి.. సూర్య డిజర్వ్‌, రాజ్‌ అన్‌డిజర్వ్‌ అని పేర్కొన్నారు.
గీతూ.. శ్రీహాన్‌ డిజర్వ్‌, మెరీనా అన్‌డిజర్వ్‌ అని చెప్పింది.
రేవంత్‌, శ్రీసత్య, అర్జున్‌, ఇనయ, బాలాదిత్య.. శ్రీహాన్‌ డిజర్వ్‌, మెరీనా అన్‌డిజర్వ్‌ అని చెప్పేశారు.
ఫైమా.. రేవంత్‌ డిజర్వ్‌డ్‌, మెరీనా అన్‌డిజర్వ్‌డ్‌ అని అభిప్రాయపడ్డారు.
రోహిత్‌.. బాలాదిత్య డిజర్వ్‌, అర్జున్‌ అన్‌డిజర్వ్‌ అని చెప్పాడు.
రాజ్‌.. శ్రీహాన్‌ డిజర్వ్‌, రేవంత్‌ అన్‌డిజర్వ్‌ అని తెలిపాడు.
సూర్య.. గీతూ డిజర్వ్‌, వాసంతి అన్‌డిజర్వ్‌ అని పేర్కొన్నాడు.
కీర్తి.. రేవంత్‌ డిజర్వ్‌, వాసంతి అన్‌డిజర్వ్‌ కంటెస్టెంట్‌గా పేర్కొంది.
ఆదిరెడ్డి.. శ్రీహాన్‌ డిజర్వ్‌, అర్జున్‌ అన్‌డిజర్వ్‌ అని పేర్కొన్నాడు.

ఫైనల్‌గా ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్‌, వాసంతి, అర్జున్‌, మెరీనా అనర్హులుగా, సూర్య, శ్రీహాన్‌, గీతూ, రేవంత్‌ అర్హులుగా నిలిచారు. ఏ జాబితాలోనూ పేర్లులేని వారంతా తటస్థులని పేర్కొన్నాడు నాగ్‌. మొత్తానికి అర్హులలో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని హౌస్‌మేట్స్‌ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది.

తర్వాత శ్రీసత్య గేమ్‌ గురించి మాట్లాడాడు హోస్ట్‌. టీమ్‌ లీడర్‌గా శ్రీసత్య ఫెయిర్‌గేమ్‌ ఆడాలని సూక్తులు చెప్పింది, మరి తను పాటించిందా? అని ప్రశ్నించాడు. మళ్లీ తనే అందుకుంటూ.. చీటీల్లో ఎవరి పేరు వస్తే వారు నామినేట్‌ అన్నారు. అందులో శ్రీసత్య పేరొచ్చింది. తెల్లారేసరికి ఆమె చీటీలు వద్దు, ఓటింగ్‌ అనేసింది. అంటే ఆమె అందరినీ మానిప్యులేట్‌ చేసి ఓటింగ్‌ వేయడం అవసరమా? అని అడిగాడు. దానికామె చీటీలాట ఆడి తిట్టించుకోవడం ఎందుకని ఓటింగ్‌కు వెళ్లామని కవర్‌ చేసింది. ముందు చీటీలు అని చెప్పి తర్వాత ఓటింగ్‌కు వెళ్లడం కరెక్టా? కాదా? అని ఆమె టీమ్‌నే అడగ్గా గీతూ మాత్రమే అందులో తప్పేముంది? కరెక్టేనంటూ సత్యకు సపోర్ట్‌ చేసింది. మిగతావారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో నాగ్‌.. నీ టీమ్‌ను నువ్వు మానిప్యులేట్‌ చేశావన్నాడు.

రూ.5 లక్షలు గెలుచుకునే అవకాశం
బిగ్‌బాస్‌ 6 స్టైలిస్ట్‌ కంటెస్టెంట్‌ ఆఫ్‌ ద సీజన్‌గా నిలిచినవారికి రూ.5 లక్షలు లభిస్తాయని లెన్స్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మీకు ఇష్టమైన లెన్స్‌కార్ట్‌ స్టైలిష్‌ హౌస్‌మేట్‌కు ప్రతివారం ఓటు వేసి టైటిల్‌ గెలిచేలా చేయాలి. ఎక్కువసార్లు విన్‌ అయిన కంటెస్టెంట్‌ రూ.5 లక్షలు గెలుస్తారు. ప్రేక్షకులు లెన్స్‌కార్ట్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో వారికి ఓటేయాల్సి ఉంటుంది.

చదవండి: తమ్మీ.. నీకు అడుక్కు తిందామన్నా దొరకదు
కన్ఫ్యూజన్‌ మాస్టర్‌ ఎలిమినేటెడ్‌!

మరిన్ని వార్తలు