Bigg Boss Telugu 6: శ్రీహాన్‌లోని బ్యాడ్‌ క్వాలిటీని బయటపెట్టిన శ్రీసత్య

27 Nov, 2022 15:46 IST|Sakshi

ఫ్యామిలీస్‌ రాకతో హౌస్‌మేట్స్‌కు ఆనందంతో పాటు ఎవరు గెలుస్తారనేదానిపై ఓ క్లియర్‌ పిక్చర్‌ కనబడింది. ఎవరు టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తారన్నప్పుడు మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్‌ రేవంత్‌ పేరు చెప్పారు. తర్వాత శ్రీహాన్‌, ఇనయ పేర్లు వినిపించాయి. అంటే అసలు సిసలైన పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉందన్న సంకేతాలు కంటెస్టెంట్లకు చేరాయి. మరీ ముఖ్యంగా గెలుపు గాలులు రేవంత్‌వైపు వీస్తున్నట్లు వారికి చూచాయగా అర్థమైంది.

ఇదిలా ఉంటే టాప్‌ 9 కంటెస్టెంట్లను ఎవరిలో చెడు లక్షణాలు ఉన్నాయో చెప్పమన్నాడు నాగ్‌. దీనికి ఇనయ.. కొన్ని సందర్భాల్లో రాజ్‌ ఎందుకు అరుస్తాడో అర్థం కాదని చెప్పింది. ఆదిరెడ్డి వంతురాగా.. రేవంత్‌ బాగా ఆడతాడు, అలాంటి వ్యక్తి బాగా ఆడతానని ప్రూవ్‌ చేసుకోనవసరం లేదన్నాడు. శ్రీసత్య.. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది.

ఫైమాకు ఇంతవరకూ వెటకారం తగ్గలేదన్నాడు రేవంత్‌. ఇక సంచాలక్‌గా ఉన్నప్పుడు ఏ కంటెస్టెంట్‌కూ సపోర్ట్‌ చేయొద్దని ఫైమాకు చురకలంటించాడు నాగ్‌. ఇంకా ఈ కంటెస్టెంట్లు ఎవరి గురించి ఏం చెప్పారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే!

చదవండి: చచ్చినా బిగ్‌బాస్‌కు రానన్నాడు, ఇప్పుడేకంగా కప్పుకే గురి పెట్టాడు
ఫైమా చేతిలో ఎలిమినేషన్‌, అతడే ఎలిమినేట్‌ కానున్నాడా?

మరిన్ని వార్తలు