Bigg Boss 6 Telugu: రేవంత్‌తో పెట్టుకున్న శ్రీసత్య, ఇచ్చిపడేసిన సింగర్‌

11 Nov, 2022 17:01 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీ దాదాపు ముగిసినట్లే! లైవ్‌ టెలికాస్ట్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇక మిగిలిందల్లా వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎంచుకోవడమే! ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో వరస్ట్‌ ఇంటిసభ్యులను ఎంచుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతోందని ఇనయకు స్టాంప్‌ గుద్దాడు ఆదిరెడ్డి. రోహిత్‌ కూడా ఇనయను చెత్త కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు. ముందు వారాలతో పోలిస్తే ఈవారం నీలో మార్పు కనిపించిందని, అది నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్‌ గుద్దింది శ్రీసత్య. ఏం మార్పు, ఏమైనా లావయ్యానా? అని రేవంత్‌ సెటైర్‌ వేయగా ఈ వెటకారమే నచ్చలేదంది శ్రీసత్య.

తర్వాత రేవంత్‌ వంతు రాగా.. ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్‌ వేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. కెప్టెన్సీ టాస్క్‌లో అంత అన్యాయం చేసిన రేవంత్‌ను వదిలేసి రోహిత్‌.. ఇనయకు ఓటేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ సగం తెలివితేటల వల్లే కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రేవంత్‌.. ఇన్నాళ్లకు సత్య నిజస్వరూపం తెలుసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్‌. మరి ఎవరు వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకెళ్లారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: చెత్త సంచాలక్‌, రోహిత్‌కు అన్యాయం

మరిన్ని వార్తలు