Bigg Boss Telugu 6: రేవంత్‌ పరువు తీసిన నాగ్‌, ఇరుక్కుపోయిన వసంతి!

15 Oct, 2022 17:59 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో అతడు ఇంకా ఎందుకున్నాడు? అన్న జనాల నోటితోనే ఇతడు హౌస్‌లో మరికొన్ని వారాలు ఉండాలి అనేలా చేశాడు రోహిత్‌. ఒక్క టాస్క్‌.. ఒకే ఒక్క టాస్క్‌తో తన గ్రాఫ​ పెంచుకున్నాడు. బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌లో ఇంటిసభ్యులందరి కోసం రెండువారాలు నామినేషన్‌లో ఉండేందుకు సిద్ధపడ్డాడు. కానీ అతడు చేసిన త్యాగానికి హౌస్‌మేట్స్‌ ప్రతిఫలంగా వెన్నుపోటు పొడిచారు. ఫ్యామిలీతో మాట్లాడేందుకు వీలు లేకుండా ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా తనను లిఫ్ట్‌ చేయనివ్వలేదు. అందుకు రోహిత్‌ మనసు చివుక్కుమంది. అయితే అతడి త్యాగాన్ని హోస్ట్‌ నాగార్జున గుర్తించాడు.

రోహిత్‌ మీకోసం అంత పెద్ద త్యాగం చేస్తే మీరందరూ ఎంత స్వార్థం చూపించారని విమర్శించాడు. అతడి కోసం కచ్చితంగా ఎవరో ఒకరు ఏదైనా త్యాగానికి సిద్ధమవ్వాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎవరు త్యాగం చేయాలో రోహిత్‌ డిసైడ్‌ చేస్తాడనడంతో అతడు వసంతిని ఎంచుకున్నాడు. బిగ్‌బాస్‌.. ఆమె జుట్టును భుజంపై వరకు కత్తిరించుకోవాలన్నాడు. తాజా ప్రోమోలో వసంతి అందుకు సిద్ధపడినట్లే కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్‌ రేవంత్‌ నిద్రపోయిన వీడియో, బాలాదిత్యకు.. గీతూ బిగ్‌బాస్‌తో మాట్లాడిన ముచ్చటంతా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరగనుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: లుంగి డ్యాన్స్‌లో రెచ్చిపోయిన కీర్తి
ఇనయనే వెనకాల తిరుగుతోంది: సూర్య గర్ల్‌ఫ్రెండ్‌

మరిన్ని వార్తలు