Bigg Boss 7 Elimination: అలాంటి కామెంట్స్.. ఆమెపై ఎలిమినేషన్ కత్తి?

22 Sep, 2023 21:02 IST|Sakshi

'బిగ్‌బాస్' మొన్నే మొదలైంది. కళ్లు మూసి తెరిచేలోపే మూడోవారం చివరకొచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ. ఈసారి లిస్టులో ఏడుగురు ఉండగా.. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పలేం. అయితే ఓ కంటెస్టెంట్స్‌పై హౌసులోని ఓ లేడీ కంటెస్టెంట్ కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడవే ఆమెని చిక్కులో పడేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో ప్రమాదం.. నొప్పి తట్టుకోలేక లేడీ కంటెస్టెంట్ కేకలు!)

ఈసారి 'బిగ్‌బాస్'లోకి అమ్మాయిలు, అబ్బాయిలు తలో ఏడుగురు వచ్చారు. అయితే తొలి రెండు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా.. ఇలా ఇద్దరు లేడీస్ హౌస్ నుంచి బయటకెళ్లిపోయారు. ఇప్పుడు మూడో వారం కూడా ఓ లేడీ కంటెస్టెంట్.. టాటా బాయ్ బాయ్ చెప్పేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నామినేషన్స్‪‌లో ఉన్నవాళ్లలో లేడీస్ అంటే.. శుభశ్రీ, ప్రియాంక, దామిని, రతిక ఉన్నారు.

పైన చెప్పిన నలుగురు అమ్మాయిల్లో దామిని తప్ప మిగతా వాళ్లంతా ఏదో ఓ విధంగా హౌసులో హైలైట్స్ అవుతున్నారు. దీంతో వాళ్లకు ఓట్లు కూడా గట్టిగానే పడుతున్నాయి. అలానే రీసెంట్‌గా వినాయక చవితి సందర్భంగా ప్రిన్స్ యవర్‌ని ఉద్దేశిస్తూ ఈమె మతపరమైన కామెంట్స్ చేసిందట. ఇప్పుడవే హౌస్ నుంచి ఈమెని పంపించేస్తారనడానికి కారణంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఇదే నిజమనిపిస్తుంది. ఏదనేది మరో రోజులో క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

మరిన్ని వార్తలు