Bigg Boss 7 Elimination: అనుకోని ట్విస్ట్.. ఆమెని పంపించేశారా?

30 Sep, 2023 16:32 IST|Sakshi

బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌లో అనుకోనిది జరిగింది. ప్రతివారంలానే ఈసారి కూడా ఎలిమినేషన్ చేశారు. అయితే ఈసారి హాట్ బ్యూటీని హౌస్ నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. అదే టైంలో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి? బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్)

గత సీజన్ల సంగతేమో గానీ ఈసారి బిగ్‌బాస్.. అనుకున్న దానికంటే కాస్త డల్‌గా నడుస్తోంది. సోమవారం, వీకెండ్ ఎపిసోడ్స్‌లో తప్పితే మిగతా రోజుల్లో ఎంటర్‌టైన్ చేసే విషయంలో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు అమ్మాయిలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. గ్లామర్ చూపించడంలో శోభాశెట్టి, రతిక వావ్ అనిపిస్తున్నారు. కొందరు వీళ్లకోసమే చూస్తున్నారు కూడా!

సరే ఇదంతా పక్కనబెడితే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. వీళ్లలో ప్రియాంక, రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, యవర్ అన్నారు. అయితే ప్రియాంక, గౌతమ్, యవర్, శుభశ్రీ సేవ్ అయినట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్లలో రతిక ఎలిమినేట్ అయిపోయిందనే సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం హౌసులో గ్లామర్ తగ్గినట్లే. ఇలా జరిగితే మాత్రం షో చూసే కుర్రాళ్లు డిసప్పాయింట్ కావడం గ్యారంటీ!

(ఇదీ చదవండి: ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే)

మరిన్ని వార్తలు