Bigg Boss 7 Telugu Promo: ఏడ్చేసిన శోభా.. త్యాగానికి సిద్ధపడ్డ ప్రియాంక.. మరి అమర్‌?

21 Sep, 2023 17:11 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వీరంతా కంటెస్టెంట్లే అయినప్పటికీ ఓ ఇద్దరు మాత్రం హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే! సందీప్‌, శివాజీ పవరాస్త్ర దక్కించుకోగా తాజాగా మూడో పవరాస్త్ర కోసం పోటీ జరుగుతోంది. ఇందుకోసం బిగ్‌బాస్‌ నేరుగా ముగ్గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకున్నాడు. అమర్‌దీప్‌ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్‌ యావర్‌ను పవరాస్త్ర కోసం పోటీపడే కంటెండర్లుగా ఎంపిక చేశాడు.

సత్తా చాటిన ప్రిన్స్‌
ఈ ఎంపికతో అందరూ ఏకీభవించారా? లేదా? తెలుసుకునేందుకు మిగతా కంటెస్టెంట్ల అభిప్రాయం అడిగాడు. ఈ క్రమంలో చాలామంది ప్రిన్స్‌ యావర్‌ ఇంటిసభ్యుడిగా ఉండేందుకు అనర్హుడు అని చెప్పాడు. దీంతో ప్రిన్స్‌ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అతడు విజయం సాధించి కంటెండర్‌గా నిలబడ్డాడు. తర్వాత శోభాకు అత్యంత కారంగా ఉండే చికెన్‌ తినాలని ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఏడుస్తూనే టాస్క్‌ పూర్తి చేసేసింది శోభా. ఇక మిగిలిందల్లా అమర్‌దీప్‌.

ఇక్కడ బిగ్‌బాస్‌ పెద్ద ఫిట్టింగే పెట్టాడు. అతడికి జుట్టంటే చాలా ఇష్టం. ఓసారి రవితేజ అతడి నెత్తిన చేయేసి తన జుట్టులానే ఉందని చెప్పాడట. అందుకని దాన్ని తీసేయడానికి అస్సలు ఇష్టపడడు. అలాంటి ఇప్పుడేకంగా బిగ్‌బాస్‌ గుండు గీయించుకోవాలని చెప్పాడు. దీనికి ససేమీరా కుదరదని చెప్పేశాడు. దీంతో జుట్టు కత్తిరించుకునేందుకు ప్రియాంక జైన్‌ రెడీ అయింది. అన్నట్లుగా తన హెయిర్‌ కట్‌ చేసుకుంది. అలా ఆమె కంటెండర్‌గా నిలిచింది. మరి ప్రియాంక, శోభా, ప్రిన్స్‌.. ఈ ముగ్గురిలో ఎవరు పవరాస్త్ర గెలుచుకుంటారో చూడాలి!

చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్‌.. అంటే ముందే ప్లాన్‌.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు