Bigg Boss 7 Telugu: శివాజీది కన్నింగ్‌ గేమ్‌, ప్రశాంత్‌ గురించి మాట్లాడటమే వేస్ట్‌..

25 Sep, 2023 12:37 IST|Sakshi

మధుర గాత్రంతో పాటల రూపంలో ఎప్పుడూ వినిపించే దామిని బిగ్‌బాస్‌ షో ద్వారా కనిపించాలనుకుంది. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకుంది. ఆటతో సత్తా చాటాలనుకుంది. అయితే ఎప్పుడూ కిచెన్‌లోనే వంట చేస్తూ వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఆటలో వెనుకబడింది. ఫలితంగా మూడో వారానికే హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ బజ్‌ షోలో పాల్గొంది. గీతూ రాయల్‌ అడిగే సూటి ప్రశ్నలకు బిక్కముఖం వేసింది. ప్రిన్స్‌ యావర్‌ ముఖాన, నోటిలో పేడ కొట్టిన టాస్క్‌ను గుర్తు చేసింది గీతూ.

పేడ కొట్టి ఒక మనిషికి ఊపిరాడకుండా చేయొచ్చనుకున్నారా? అని అడగ్గా అది కేవలం ఒక టాస్క్‌ మాత్రమేన, తానేమైనా సీరియల్‌ కిల్లర్‌లా కనిపిస్తున్నానా? అని అడిగింది. తను ఇంగ్లీష్‌లో మాట్లాడిన బూతులను సైతం ప్రస్తావించింది గీతూ. నీ దృష్టిలో తెలుగులో మాట్లాడితే బూతులు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా అనడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుడ్లు తేలేసింది దామిని. తర్వాత కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది.

రతిక అన్నీ సగం సగం వింటుందని, శుభశ్రీ రెడీ అవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా పని కూడా చేస్తే బాగుంటుందని పేర్కొంది. యావర్‌ ఇతరులను కాస్త అర్థం చేసుకోవాలని, తేజ వెటకారం తగ్గించుకోవాలంది. శోభా శెట్టి చెంచా తేజ అని, గౌతమ్‌ తనకే అన్నీ తెలుసనుకుంటాడంది. శివాజీది కన్నింగ్‌ గేమ్‌ అని, ప్రశాంత్‌ గురించి మాట్లాడటమే వేస్ట్‌ అంది దామిని.​ మొత్తానికి హౌస్‌లో తనే తోపు అనుకున్న దామినికి బిగ్‌బాస్‌ బజ్‌లో గట్టి కౌంటర్లే పడ్డాయి.

మరిన్ని వార్తలు