Rathika Rose Exit Interview Promo: కట్టప్పనే మించిపోయావ్‌, నీకన్నా పాము నయం.. గడగడలాడించిన గీతూ.. షాకైన రతిక

2 Oct, 2023 12:13 IST|Sakshi

రతిక రోజ్‌.. ఎలిమినేట్‌ అయినప్పుడు నాగ్‌ ఓ మాటన్నాడు. ఇదొక పాఠం. బయటకు వెళ్లిన తర్వాత అబ్జర్వ్‌ చేసుకో అని చెప్పాడు. అటు తన జర్నీలోనూ ప్రశాంత్‌, యావర్‌తో నడిపిన ప్రేమ విన్యాసాలను చూపించేసరికి రతిక ముఖంలో రక్తం చుక్కలేకుండా పోయింది. పైగా లవ్‌ ట్రాక్‌లు, వెన్నుపోట్లు తప్ప ఆట ఏమీ లేదు. తన ఎలిమినేషన్‌ ప్రాంక్‌ అంటారేమోనని ఆశగా ఎదురుచూసింది రతిక. అంత సీన్‌ లేదన్నట్లుగా నాగ్‌ తనను అక్కడి నుంచి బయటకు పంపించేశాడు.

ఎవరిని వెన్నుపోటు పొడిచాను?: రతిక
ఎలిమినేషన్‌తో షాక్‌లో ఉన్న రతిక తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ గలాటా గీతూ అడిగే ప్రశ్నలకు తనకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈ రోజ్‌ హౌస్‌లో అందరినీ వాడుకుని ఆడుకోవాలనుకుంది. కానీ, చివరకు వాడిపోయింది అంటూ రతికా రోజ్‌తో ఇంటర్వ్యూ మొదలుపెట్టింది గీతూ రాయల్‌. బాహుబలిలో కట్టప్పనే మించిపోయావనడంతో.. బిక్కముఖం వేసిన రతిక.. ఎవరిని వెన్నుపోటు పొడిచానని అడిగింది. దీనికి గీతూ.. రెండు చేతులు కలిస్తేనే సౌండ్‌ వస్తుంది. ప్రశాంత్‌ విషయంలో చేయి అందించిందే మీరు.. అని చెప్పడంతో రతిక నేనా? అని అమాయకంగా ప్రశ్నించింది. మీరు హౌస్‌లోనే కాదు, ఇక్కడ కూడా మానిప్యులేట్‌ చేస్తున్నట్లు అనిపిస్తోందని కౌంటర్‌ ఇచ్చింది గీతూ.

వాడుకోవడం బాగా అలవాటేగా.. గీతూ కౌంటర్‌
ఇక హౌస్‌లో తన మాజీ ప్రియుడు(రాహుల్‌ సిప్లిగంజ్‌) గురించి పదేపదే మాట్లాడిన సంగతిని సైతం ప్రస్తావించింది గీతూ. ఎక్స్‌(మాజీ ప్రియుడు) అనే ఎమోషన్‌ను బాగా వాడుకున్నట్లు అనిపించింది. అయినా మీకు వాడుకోవడం బాగా అలవాటేగా అని సెటైర్‌ వేసింది. తన మాటలకు బిత్తరపోయిన రతిక.. వాడుకునే అలవాటుంటే ఆ టైం వచ్చినప్పుడే వాడుకునేదాన్ని అని బదులిచ్చింది. ప్రశాంత్‌ క్రైయింగ్‌ స్టార్‌ అయితే రతిక కన్నింగ్‌ స్టార్‌, ఫ్లిప్పింగ్‌ స్టార్‌.. రతిక కన్నా పాము నయం అంటూ సోషల్‌ మీడియా వచ్చిన కామెంట్లు చూపించింది గీతూ. ఇది చూసిన రతికకు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. జనాలకు అలా అర్థమైతే అది నా ఖర్మ, దానికేం చేయలేం అని ఆన్సరిచ్చింది.

ప్రశాంత్‌ అపరిచితుడు
అనంతరం పల్లవి ప్రశాంత్‌ ఫోటోకు నిప్పు పెడుతూ రోజుకో యాంగిల్‌ చూపిస్తున్నాడు. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రతిక ఇంకా షాక్‌ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదు. ఏదైతేనేం.. ఈ ఇంటర్వ్యూ ప్రోమో కింద జనాలు మాత్రం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఎలిమినేట్‌ అయితే బాధేసేది, కానీ రతిక వెళ్లిపోయినందుకు ఎంత సంతోషంగా ఉందో అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ 6లో గీతూ, బిగ్‌బాస్‌ 7లో రతిక.. చాలా ఇరిటేట్‌ చేశారని అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం.. రతికను అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ముందు ముందు జనాలకు తెలిసొస్తుందని చెప్పుకొస్తున్నారు.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్‌, ప్రియుడు ఎమోషనల్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు