Bigg Boss 7 Telugu: మూడోవారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. కానీ!

24 Sep, 2023 19:32 IST|Sakshi

అనుకున్నదే జరిగింది. బిగ్‌బాస్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. ఎపిసోడ్ ఇంకా ప్రసారం కానప్పటికీ ఈ విషయం బయటపడింది. హౌసులో మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. ఎలిమినేషన్ విషయంలో బిగ్‌బాస్ పొరపాటు చేస్తున్నాడా? లేదా అదే జరుగుతుందా? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 

బిగ్‌బాస్ 7వ సీజన్ సెప్టెంబరు 3న గ్రాండ్‌గా ప్రారంభమైంది. గత సీజన్లలా కాదు ఈసారి 'ఉల్టా పుల్టా' అని నాగ్ చెప్పుకొచ్చాడు. కానీ మూడో వారం అయిపోవస్తున్నా షోలో జోష్ కనిపించట్లేదు. తొలి రెండువారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా తక్కువ ఓట్లు పోల్ అయిన కారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు కూడా మరో లేడీ కంటెస్టెంట్ బయటకొచ్చేసింది.

ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉండగా అందులో దామినికి తక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అయితే షో ప్రారంభమైనప్పుడు తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలని తీసుకొచ్చిన బిగ్‌బాస్.. ఎలిమినేషన్ మాత్రం లేడీస్‌ని చేస్తున్నాడు. వచ్చే వారం కూడా ఇదే కొనసాగితే మాత్రం హౌసులో జెండర్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశముంది. అలానే గతంలో ప్రతి సీజన్‌లోనూ సింగర్స్ వచ్చారు. వాళ్లలో రాహుల్ విజేతగా నిలవగా, గీతా మాధురి లాంటి వాళ్లు టాప్-5 వరకు వెళ్లారు. కానీ దామిని మాత్రం మూడో వారానికే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ విజేత చేతికి అందని రూ.25 లక్షలు.. పట్టించుకోని టీమ్‌)

మరిన్ని వార్తలు