Bigg Boss 7 Day 12 Highlights: 'బిగ్‌బాస్'లో ఓవైపు గొడవలు.. మరోవైపు సడన్ ట్విస్టులు

15 Sep, 2023 23:14 IST|Sakshi

'మాయ అస్త్ర' గెలుచుకున్న రణధీర టీమ్‌లో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యవర్.. గౌతమ్, సందీప్‌తో పెద్ద గొడవలు పెట్టుకున్నాడు. అలానే రెండో 'పవర్ అస్త్ర' కోసం ఆ ముగ్గురి మధ్య 'బిగ్‌బాస్' ఓ పోటీ పెట్టారు. ఇంతకీ అదేంటి? 12వ రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

యవర్ vs గౌతమ్
టాస్కులో భాగంగా ప్రిన్స్ దగ్గరున‍్న భాగాన్ని తీసుకుని.. 'మహబలి' టీమ్ దాన్ని శివాజీ చేతిలో పెట్టారు. దీనికి ప్రిన్స్ ఒప్పుకోలేదు. తన పార్ట్‪‌ని అస్సలు ఇచ్చేదే లేదని నానా రాద్ధాంతం చేశాడు. ఒకానొక దశలో బరస్ట్ అయిపోయిన యవర్.. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్ గేమ్ అన‍్నాడు. 'ఇచ్చేయ్ ఇచ్చేయ్' అని తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు. గేటు తెరవండి, ఇంటికెళ్లిపోతా అని చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చాడు.

(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!)

ప్లేట్ మార్చిన రతిక
మహబలి టీమ్ లో అందరూ అనుకుని.. శివాజీ, షకీలాకు మాయ అస్త్ర భాగాల‍్ని ఇచ్చారని అందరూ అనుకున్నారు. కానీ అదే గ్రూపులో ఉన్న రతిక.. ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ ప్లేట్ తిప్పేసింది. తాను శివాజీ, ప్రిన్స్ అని చెబితే.. తన మాట అస్సలు వినలేదని సొంత టీమ్‌పైనే చాడీలు చెప్పింది. ఆడితే జెన్యూన్‌గా ఆడండని అరిచి గోల చేసింది.

రతిక అలా అనేసరికి ప్రశాంత్, గౌతమ్ ఆమెపై రెచ్చిపోయారు. ఇప్పుడు చెబితే ఎలా అని గొడవపడ్డారు. కాసేపు అయితే ఆమెని కొట్టేవాళ్లేమో అన్నంతలా ఊగిపోయారు. ఇకపోతే రతిక, వాళ్ల టీమ్ వాళ్లతో గొడవపడుతుంటే మధ్య ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ముఖం వరకు వచ్చి గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. ఇంగ్లీష్, హిందీలో మాటాడుతూ హౌస్ రూల్స్ మళ్లీ బ్రేక్ చేశాడు. బాడీ చుడూ అని ప్రిన్స్ అంటే.. ఏంటి అవి ఇంజెక్షన్స్‌తో తెచ్చుకున్నవే కదా అని గౌతమ్ సైగ చేశాడు. దీంతో యవర్ ఒళ్లు మండింది. పర్సనల్‌కి వెళ్లొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెచుకుంది. కానీ గౌతమ్ తగ్గితేగా! గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పదే పదే మీదకొస్తూ యవర్ అల్లరల్లరి చేశాడు. 

బిగ్‌బాస్‌కే వార్నింగ్
హౌసులో రాజకీయాలు ఎక్కువైపోయాయని రతిక.. గట్టిగా అరుస్తూ చెప్పింది. అలానే ఇక్కడందరూ ఫేక్ మనుషులు అని, వాళ్లతో ఉండలేనని యవర్ చెప్పాడు. తన పార్ట్ లాగేసుకున్నారని, ఏకంగా సందీప్‌తోనూ గొడవపడ్డాడు. తనకు ఆన్సర్ కావాలని, లేకపోతే అప్పటివరకు మైక్ వేసుకోనని బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు.

(ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ)

యవర్ కూల్ అయ్యాడు
అర్థరాత్రి కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏమైందని యవర్‌ని బిగ్‌బాస్ అడిగాడు.. దీంతో జరిగినదంతా చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. మిమ్మల్ని బిగ్ బాస్ చూస్తున్నారు. బయట ప్రేక్షకులూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ నుంచి సారీ కావాలని యవర్ అడగ్గా.. అలాంటిదే ఉండదు అని డైరెక్ట్‌గా చెప్పకుండా, మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారు, మీరు ఇక బయటకెళ్లొచ్చు అని బిగ్‌బాస్, యవర్‌ని కూల్ చేశాడు.

ట్విస్ట్ ఇచ్చిన పెద్దన్న
అయితే గొడవ జరుగుతున్న టైంలో మాట వదిలావ్ అని రతికకి షకీలా గీతోపదేశం చేసింది. ఏదైతేనేం చివరకు సారీ చెప్పిన రతిక.. షకీలా కాళ్లకు దండం పెట్టింది. మరోవైపు రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడ్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారు అని సందీప్‌తో బిగ్‌బాస్ చెప్పారు. దీంతో చాలాసేపు ఆలోచింది అతడు అమరదీప్ పేరు చెప్పాడు. అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని ఎంటర్ చేయడేం ఏంటని శివాజీ, షకీలాతో వాదన పెట్టుకున్నాడు. నలుగురు కలిసి ఆడుతున్నారని క్లియర్‌గా తెలిసిపోతుందని(నలుగురు అంటే శోభాశెట్టి, ప్రియాంక, అమరదీప్‌తో సందీప్ కుమ్మక్కయ్యాడు) శివాజీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తలుపు తీయరా సామీ నేను వెళ్లిపోతా.. నాకొద్దు ఈ గోల అని బిగ్ బాస్ తో అన్నాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు)

రతికతో యవర్ లవ్?
అయితే బిగ్‌బాస్ తీరు తనకు నచ్చట్లేదని, ప్లీజ్ నన్ను ఎలిమినేట్  చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు. మరోవైపు రతికని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ యవర్‌ని అడిగితే.. కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు. కొన్నిరోజులు ఆగు నీకే తెలుస్తుందని ప్రశాంత్.. తనకు తొలివారం జరిగిన అనుభవం దృష్ట్యా యవర్‌పై సెటైర్ వేశాడు. లవ్ వద్దురా నాయనా అని అన్నాడు.

అరిచే టాస్కులో రచ్చ
రెండో పవర్ అస్త్ర కోసం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు గెలిచినట్లు. కాస్త గ్యాప్ ఇచ్చి, శివాజీ-అమరదీప్-షకీలా తలో మూడుసార్లు అరిచారు. ఈ గ్యాప్‌లో యవర్.. సందీప్‌తో గొడవపెట్టుకున్నాడు. చపాతీలు ఎవరూ చేయట్లేదని తనవైపు వేలు చూపిస్తున్నావ్ ఏంటని దగ్గరకెళ్లి గొడవపెట్టుకోవడానికి చూశాడు. సందీప్ చాలా ప్రశాంతంగా ఉండటంతో అక్కడికది ఎండ్ అయిపోయింది. ఇకపోతే రెండో పవర్ అస్త్రతోపాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఎవరో  వీకెండ్‌లో నాగార్జున చెప్తారు, అప్పటివరకు వెయిట్ చేయండని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?)

మరిన్ని వార్తలు