Bigg Boss 7 Day 14 Highlights: షకీలా ఎలిమినేట్.. కొన్నాళ్లు ఈమెని ఉంచాల్సింది!

17 Sep, 2023 22:59 IST|Sakshi

'బిగ్‌బాస్'లో మిగతా రోజుల సంగతెలా ఉన్న వీకెండ్ వస్తే ఎంటర్‍‌టైన్మెంట్‌తో పాటు ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. శనివారం అందరికీ ఓ రౌండ్ వేసిన నాగార్జున.. ప్రశంసలతో పాటు కౌంటర్స్ ఇచ్చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో బోలెడంత ఫన్ ఇస్తూనే, చివర్లో ఎలిమినేషన్ కూడా చేశాడు. అనుకున్నట్లే ఆమె ఇంటినుంచి బయటకెళ్లినప్పటికీ.. కాస్త డిఫరెంట్‌గా జరిగింది. ఇంతకీ ఆదివారం (Day-14) హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!)

శివాజీకి కౌంటర్స్
సోమవారం వినాయక చవితి కాబట్టి.. గణేశుడి పాటకు డ్యాన్స్ చేస్తూ హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. అయితే శనివారం ఎపిసోడ్‌లో పవరస్త్ర గెలుచుకున్న శివాజీ.. దాన్ని హాల్‌లో అలానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నాగ్ చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనే తీసుకుని ఉంటే, అది వాళ్లది అయ్యేదని చెప్పాడు. ఎవరూ తీసుకోకపోవడంతో దాన్ని శివాజీకే ఇచ్చేశారు.

సండే ఫండే
ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే దాని కంటే ముందు కాస్త హౌస్ అంతా ఫన్ జనరేట్ చేయడం కామన్. ఈసారి కూడా భళ్లాలదేవ, కట్టప్ప అని రెండు బొమ్మలు పెట్టారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్.. హౌసులో తనకి ఎవరు భళ్లాలదేవ? ఎవరు కట్టప్ప? అనేది చెప్పి కారణాలు చెప్పాలని నాగ్ 'BB సామ్రాజ్యం' అనే గేమ్ పెట్టాడు. ఇందులో తేజని నలుగురికి కట్టప్ప అయ్యాడు. గౌతమ్.. ముగ్గురికి కట్టప్ప అయ్యాడు. పూర్తి లిస్ట్ దిగువన ఉంది చూసేయండి.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?)

కంటెస్టెంట్ - కట్టప్ప, భళ్లాలదేవ

 • శోభాశెట్టి.. గౌతమ్, ప్రిన్స్
 • గౌతమ్ - రతిక, ప్రిన్స్
 • రతిక - తేజ, గౌతమ్
 • తేజ - గౌతమ్, శివాజీ
 • శివాజీ - తేజ, ప్రశాంత్
 • ప్రశాంత్ - తేజ, శివాజీ
 • దామిని - శుభశ్రీ ,సందీప్
 • సందీప్ - శివాజీ, శుభశ్రీ 
 • శుభశ్రీ - తేజ , సందీప్
 • ప్రియాంక -  శివాజీ , సందీప్
 • ప్రిన్స్ - సందీప్, శివాజీ
 • అమరదీప్ - గౌతమ్, సందీప్
 • షకీలా -  ప్రిన్స్, ప్రశాంత్

వాళ్లు సేఫ్
ఓవైపు పైన చెప్పిన జరుగుతుండగానే మరోవైపు మధ్యలో ఓసారి ఎలిమినేషన్ గురించి నాగ్ చెబుతూ వచ్చాడు. అలా తొలి రౌండులో ప్రిన్స్, రెండో రౌండులో రతిక, మూడో రౌండులో శోభాశెట్టి, ప్రశాంత్, నాలుగో రౌండులో గౌతమ్ సేవ్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ కంటే ముందు 'కొంచెం గెస్ చేయ్ గురూ' అని నాగ్.. మరో గేమ్ పెట్టాడు. ఈ వారం ఆడిన రణధీర, మహాబలి గ్రూపులని ఇందులో అలానే పార్టిసిపేట్ చేయమన్నాడు. దీంతో మాయస్త్ర టాస్కులో ఓడిన మహబలి టీమ్ ఇక్కడ గెలిచారు. లగ్జరీ బడ్జెట్ సొంతం చేసుకున్నారు.

(ఇదీ చదవండి: రజనీకాంత్‌తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!?)

షకీలా ఎలిమినేట్
ఇక చివరగా మిగిలిన తేజ, షకీలా.. యాక్టివిటీ రూంలోకి వెళ్లారు. ఎవరి ఫొటో బయటకొస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని నాగ్ చెప్పారు. తేజ ఫొటో ఉండటంతో అతడు బతికిపోయాడు. షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె వెళ్లిపోవడంతో సందీప్, అమర్‌దీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తేజ కూడా ఎమోషనల్ అయ్యాడు. షకీలా తనకు అమ్మలా అనిపించారని అన్నాడు. దామిని అయితే 'పెదవే పలికిన మాటల్లోనే' పాట పాడింది. అయితే ఈ సాంగ్ పాడుతున్నప్పుడు షకీలా.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా వెళ్తూ వెళ్తూ హౌసు మొత్తాన్ని ఏడిపించేశారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది.

షకీలా ఉండాల్సింది
అయితే అప్పట్లో వ్యాంప్ తరహా పాత్రలతో కుర్రాళ్లని పిచ్చెక్కించిన షకీలా వేరు. హౌసులోకి వచ్చిన షకీలా వేరు. ఎందుకంటే 'బిగ్‌బాస్'లో చాలా హుందాగా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో ఈమెకి తక్కువ ఓట్లు పడ్డాయి. బహుశా ఇంకొన్నాళ్లు హౌసులో షకీలా ఉండుంటే బాగుండేది.

(ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!)

మరిన్ని వార్తలు