Bigg Boss 7 Day 15 Highlights: నామినేషన్స్‌లో ఆ ఏడుగురు.. చివరలో ట్విస్ట్

18 Sep, 2023 23:07 IST|Sakshi

'బిగ్‌బాస్' మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయి, బయటకెళ్లిపోవడంతో కాస్త ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు.. నామినేషన్స్ వచ్చేసరికి మళ్లీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావుడి చేశారు. ఈ వారం కూడా ఏడుగురు నామినేషన్స్‌లో నిలవగా, చివరలో 'బిగ్‌బాస్' చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం.

సుత్తిలేకుండా మొదలయ్యాయి
షకీలా ఎలిమినేట్ అయి, హౌస్ నుంచి బయటకెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ షురూ అయింది. బెడ్ రూంలో దామిని, ప్రియాంక.. ప్రిన్స్ యవర్ గురించి మాట్లాడుకున్నారు. అతడి ప్రవర్తన నచ్చలేదని అన్నారు. నిద్రపోయే లేచేసరికి సోమవారం వచ్చేసింది. నేరుగా సుత్తిలేకుండా నామినేషన్స్ ప్రారంభమైపోయాయి. హుసులో అనర్హుడు అనిపిస్తున్న ఇద్దరినీ నామినేట్ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు.

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?)

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • ప్రియాంక - యవర్, గౌతమ్
  • ప్రశాంత్ - తేజ, దామిని
  • శోభాశెట్టి - శుభశ్రీ, రతిక
  • అమర్‌దీప్ - గౌతమ్, శుభశ్రీ
  • రతిక - శుభశ్రీ, గౌతమ్
  • తేజ - ప్రశాంత్, గౌతమ్
  • యవర్ - ప్రియాంక, దామిని
  • దామిని - యవర్, శుభశ్రీ
  • గౌతమ్ - రతిక, అమర్‌దీప్
  • శుభశ్రీ - తేజ, ప్రియాంక

నామినేషన్స్‌లో ఏం జరిగింది?
తొలుత వచ్చిన ప్రియాంక.. యవర్, గౌతమ్‌ని నామినేట్ చేసింది. అయితే గౌతమ్ పెద్దగా వ్యతిరేకించనప్పటికీ, ప్రిన్స్ యవర్ మాత్రం చాలా హడావుడి చేశాడు. ఇక ప్రశాంత్.. తేజని నామినేట్ చేస్తూ సరైన కారణం చెప్పలేకపోయాడు. మధ్యలో కల్పించుకున్న బిగ్‌బాస్.. సిల్లీ రీజన్స్ వద్దని మొట్టికాయలు వేశాడు. అయినా వల్ల కాకపోయేసరికి వదిలేశాడు. దామిని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. వంట విషయంలో తనకు పదే పదే చెప్పడం నచ్చలేదని అన్నాడు. శోభాశెట్టి.. శుభశ్రీ నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పింది. రతికకి మొండితనం, స్వార్థం ఎక్కువని కారణాలు చెప్పింది.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి)

అతి చేసిన యవర్! 
అమర్‌దీప్, రతిక, యవర్.. తమ తమ నామినేషన్స్‌ని పెద్దగా హడావుడి లేకుండా ముగించేశారు. అయితే దామిని.. తనని నామినేట్ చేసేసరికి ప్రిన్స్ యవర్ తట్టుకోలేకపోయాడు. అలానే ఆమె చెప్పేది అతడికి సరిగా అర్థం కాకపోవడం వల్ల వేరేది అనుకుని అటుఇటూ తిరుగుతూ కాస్త అతి చేశాడనిపించింది. ఇక శుభశ్రీ అయితే దామిని తనని టార్గెట్ చేస్తుందని ఈ విషయాన్ని ఆమెతోనే చెప్పింది

చివర్లో ట్విస్ట్
మిగిలిన వాళ్లలో గౌతమ్, శుభశ్రీ కూడా తమ తమ నామినేషన్స్‌ని సింపుల్‌గానే ముగించేశారు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో తొలుత శుభశ్రీ, గౌతమ్, తేజ, ప్రియాంక, దామిని, రతిక, యవర్ నిలిచారు. అయితే చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్.. పవరస్త్ర గెల్చుకున్న శివాజీ, సందీప్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. లిస్టులో ఒకరిని సేవ్ చేసి, సేఫ్ గా ఉన్నవాళ్లని  నామినేట్ చేయాలని అన్నారు. దీంతో ఇద్దరూ అనుకుని తేజని సేవ్ చేసి, అతడి ప్లేసులో అమర్‌దీప్ నామినేట్ చేశారు. అలా ఏడుగురు నామినేషన్స్‌లో నిలవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మిగతారోజుల సంగతెలా ఉన్నా.. సోమవారం మాత్రం టాప్ లేచిపోతూ ఉంటుంది. ఈసారి అలాంటిదేం లేకుండా, చాలా ప్లెయిన్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్)

మరిన్ని వార్తలు