Bigg Boss 7 Promo: ఫిట్టింగ్స్ పెట్టిన బిగ్‌బాస్.. హౌస్ అంతా ఆగమాగం

20 Sep, 2023 18:28 IST|Sakshi

కాస్త ఆలస్యం చేసినా.. 'బిగ్‌బాస్' సరైన రూట్‌లోకి వచ్చేశాడు. తొలి రెండు వారాల కాస్త సాఫ్ట్‌గా సాగిన కంటెస్టెంట్స్.. ఇప్పుడు చెలరేగిపోతున్నారు. బిగ్‌బాస్ పెడుతున్న ఫిట్టింగ్స్ వల్ల హౌస్ అంతా అల్లకల్లోలం అవుతోంది. తాజాగా ప్రిన్స్ యవర్ కి నరకం చూపించగా, శోభాశెట్టి బీభత్సమైన సీరియస్ అయిపోయింది. ఇంతకీ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది?

ప్రిన్స్-రతిక ఒకే ప్లేటులో
మూడో పవరస్త్ర కోసం బిగ్‌బాస్.. అమరదీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్‌ని ఎంపిక చేశాడు. వీళ్లలో ఎవరు అనర్హులో చెప్పాలని మిగతా కంటెస్టెంట్స్‌ని కోరాడు. వీళ్లలో ఓ ముగ్గురు యవర్ పేరు చెప్పారు. మిగతా వాళ్ల సంగతలా ఉంచితే రతిక తన పేరు చెప్పి, వెన్నుపోటు పొడిచేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కాస్త డల్ గా కనిపించిన యవర్.. రతికతో కలిసి ఒకే ప్లేటులో భోజనం చేయడం అమ్మ బాబోయ్ అనిపించింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?)

నరకం స్పెల్లింగ్ చెప్పించారు
ఇక యవర్.. మూడో పవరస్త్ర కోసం పోటీలో ఉండడటం కోసం బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. ఓ బల్లపై ముఖాన్ని పెట్టి ఉంచాలి. ఎవరెంత ఇబ్బంది పెట్టినా అస్సలు ముఖాన్ని కదల్చకూడదని కండీషన్ పెట్టాడు. దీంతో యవర్ ముఖంపై గుడ్లు పగలగొట్టడం, ఒళ్లంతా పేడ రాయడం లాంటివి చేసి అసలు సిసలు నరకాన్ని చూపించారు. 

శోభా-గౌతమ్ ఫైట్ 
మరోవైపు గౌతమ్.. తనని అనర్హురాలు అని చెప్పడాన్ని శోభాశెట్టి సహించలేకపోయింది. అతడిపై అరుస్తూ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే తన బాడీ గురించి శోభాశెట్టి కామెంట్స్ చేయడాన్ని తీసుకోలేకపోయాడు. ఇద్దరి మధ్య హీటింగ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. ఈ వ్యవహరంలో చివరకు ఏమైందనేది తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ చూడాల్సిందే.

(ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా)

మరిన్ని వార్తలు