Bigg Boss 7 Day 19 Highlights: యవర్ దురదృష్టం.. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు!

22 Sep, 2023 22:35 IST|Sakshi

'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ హౌసులో 19వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

ఫిట్టింగ్ పెట్టేశాడు!
తొలి రెండు వారాల్లో పవరస్త్రని సందీప్, శివాజీ గెలుచుకున్నారు. మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చుకుని ప్రిన్స్ యవర్, అత్యంత కారంగా ఉండే చికెన్ ముక్కలు తిని శోభా, జుత్తుని కత్తిరించుకుని ప్రియాంక.. ఫైనల్-3లో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవడమే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో.. వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు.

యవర్ బలైపోయాడు
అయితే సైడ్ అయ్యే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శోభా, యవర్ పేరుని.. యవర్, శోభా పేరుని చెప్పారు. అలా చెప్పిన టైంలో ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవపడ్డారు. ఇక డిసైడింగ్ ఓటు వేయాల్సిన ప్రియాంక.. శోభా పేరు చెప్పింది. అలానే టేబుల్ పై ఉన్న యవర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో ఇరగ్గొట్టారు. తనని పక్కకు జరపడాన్ని తట్టుకోలేకపోయిన యవర్.. అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్‌ని బలంగా కొట్టాడు. దెబ్బకు అది విరిగిపోయింది.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న 'ఏజెంట్')

కోపానికి కారణాలు చెప్పాడు
గతవారం రణధీర టీమ్‌లో ఉండి కష్టపడినప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కావొచ్చు యవర్‌కి అవకాశం రాలేదు. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తొలుత హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. శివాజీ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పాడు. జాబ్ లేదు, ఒకానొక టైంలో రూ.100 కూడా లేని రోజులు ఉన్నాయని.. అందుకే తనకు కోపం, ఆకలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. తనకు సరైన జడ్జిమెంట్ దక్కట్లేదని బాధపడిపోయాడు.

ఆమె గెలిచిందా?
చివరగా మిగిలిన ప్రియాంక-శోభాశెట్టి మధ్య బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.. బుల్‌పై తాడుని పట్టుకుని పడుకున‍్న పొజిషన్‌లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాశెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్‌లో బుల్‌పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు ప్రియాంకనే విజేత అనిపిస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చేస్తారని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?)

మరిన్ని వార్తలు