Bigg Boss 7 Day 20 Highlights: రతిక మాజీ ప్రియుడి గురించి 'బిగ్‌బాస్‌'లో డిస్కషన్

23 Sep, 2023 23:05 IST|Sakshi

'బిగ్‌బాస్' షో.. అప్పుడే మూడో వారం చివరకొచ్చేసింది. తొలి రెండు వారాలు ఓ మాదిరిగా సాగినప్పటికీ.. హౌసులో కొన్ని గొడవలు మినహా చెప్పుకోదగ్గవి అయితే ఏం జరగలేదు. గత రెండు వీకెండ్స్‌లో హోస్ట్ నాగార్జున.. ఎవరినీ పెద్దగా ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా స్మూత్ కౌంటర్స్ వేశాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు Day-20 హైలైట్స్‌లో చూద్దాం.

మూడో హౌస్‌మేట్
శనివారం ఎపిసోడ్ కోసం వచ్చిన నాగ్.. శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూపించాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సంచాలక్ సందీప్‌కి నాగ్ అక్షింతలు వేశాడు. ఎవరు గెలుచుంటారని అతడిని అడిగాడు. మరోవైపు జుత్తు తీయకుండా బయటకొచ్చేసిన అమరదీప్‌ని కూడా అడిగితే అతడు కూడా ప్రియాంక పేరు చెప్పాడు. కానీ శోభాశెట్టి.. ఎద్దు పోటీలో 12 సెకన్ల తేడాతో గెలిచింది. మూడో హౌస్‌మేట్ అయిపోయింది.

కొత్త గేమ్ పెట్టారు కానీ
ఇక నామినేషన్స్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన  నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన గేమ్ ఛేంజర్ ఎవరు? సేఫ్ గేమర్ ఎవరో? చెప్పాలని, వాళ్లకు ఆయా బ్యాడ్జి అతికించాలని చెప్పాడు. ఇప్పటికే హౌస్‌మేట్స్ అయిన శివాజీ, సందీప్ తప్ప అందరూ తమకు అనిపించిన వారి పేర్లు చెప్పారు. ఆ లిస్ట్ దిగువన ఉంది. చూసేయండి.

కంటెస్టెంట్.. గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్

  • ప్రియాంక -  శోభాశెట్టి, శుభశ్రీ 
  • శుభశ్రీ -  యవర్, తేజ
  • ప్రశాంత్ -  యవర్, తేజ
  • గౌతమ్ - ప్రియాంక, తేజ
  • దామిని - యవర్, అమరదీప్
  • తేజ - ప్రియాంక, అమరదీప్
  • శోభాశెట్టి - ప్రియాంక, ప్రశాంత్
  • యవర్ - ప్రశాంత్, దామిని
  • అమరదీప్ - దామిని, రతిక
  • రతిక - యవర్, తేజ

ఇందులో భాగంగా నాలుగు బ్యాడ్జిలు సొంతం చేసుకున్న యవర్ గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. నాలుగు బ్యాడ్జిలతో సేఫ్ ప్లేయర్ అయిన తేజకి మాత్రం నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. రాబోయే వారంపాటు ఇంట్లోని పాత్రలన్నీ క్లీన్ చేయాలని ఆర్డర్ వేశాడు. దీంతో తేజ అవాక్కయ్యాడు.

సంచాలక్‌గా సందీప్ ఫెయిల్
సంచాలక్‌గా వ్యవహరించిన సందీప్.. చికెన్ ముక్కలు తిన్న టాస్క్, ఇతర టాస్కుల్లో భాగంగా కంటెడర్స్‌కి లేనిపోని సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేసిన నాగార్జున.. గాలి మొత్తం తీసేశాడు. అతడు సంచాలక్‪‌గా ఫెయిలయ్యాడు అనుకున్నవాళ్లు చేతులు పైకెత్తండి అని నాగ్ చెప్పడంతో రతిక, ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్, తేజ చేతులు పైకెత్తారు. అంతకు ముందు శివాజీ కూడా సందీప్ చేసింది తప్పని అన్నాడు. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే.. 'నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా?' అని సందీప్‌కి నాగ్ కౌంటర్ వేశాడు. తప్పు చేసినందుకుగానూ సందీప్‌ బ్యాటరీ డౌన్ చేస్తున్నా అని చెప్పాడు. దీంతో బ్యాటరీ కాస్త.. గ్రీన్(పచ్చ) నుంచి ఎల్లోకి(పసుపు) పడిపోయింది.

అమర్‪‌కి అరటిపండు సామెత
ఇక మిగిలిన వాళ్లలో గౌతమ్‌తో మాట్లాడిన నాగ్.. శోభాతో గొడవ విషయంలో నువ్వు చేసిన దానికి కారణం ఏదైనా అయ్యిండొచ్చు కానీ అందరికీ అది షో హాఫ్‌లానే అనిపించందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరోవైపు అమరదీప్.. ఈ వారం ఆటలో ఎక్కడా కనిపించలేదని చెప్పిన నాగ్.. ఆటలో అరటిపండు సామెత చెప్పి మరీ పరువు తీసినంత పనిచేశాడు. ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఓపిక లేదా మరోసారి ఆడలేవా? కన్నీళ్లతో పనిజరగలేదు. బిగ్ బాస్ కరుణించడు అని నాగ్ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు.

రతిక మాజీ ప్రియుడు టాపిక్
గత వారం పప్పులో రెండు గ్లాసులు అయినా నీరు అయినా వేశావ్, ఈ వారం అది కూడా చేయలేదు, ఆడు నీకు ఆ శక్తి ఉందని అని చెప్పిన నాగ్.. ఆమెని కాస్త ఎంకరేజ్ చేశాడు. 'మాజీ బాయ్‌ఫ్రెండ్ అంటే గతమే కదా! గతాన్ని ఇక్కడ బుర్రలో పెట్టుకున్నావ్ అనుకో ప్రస్తుతంలో ఉండవు, భవిష్యత్తుకి కూడా వెళ్లవ్. ఎక్స్ అంటే ఎక్సే వదిలేసేయ్.. లెట్స్ లివ్  ఇట్' అని నాగార్జున సుతిమెత్తగా రతికకు సలహా ఇచ్చాడు. అయితే ఈ వారం గేమ్ ఆడకుండా బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పి రతిక సింపతీ కొట్టేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలానే నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెబుతున్నారని, ఏదో చెప్పాలని చెప్పేస్తున్నారు తప్ప ఓ స్టాండ్ లేదని కంటెస్టెంట్స్‌కి చురకలు అంటించాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో యవర్ సేఫ్ అయ్యాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

మరిన్ని వార్తలు