Bigg Boss 7 Day 21 Highlights: దామిని ఔట్.. వెళ్తూ వెళ్తూ ఆ సర్‌ప్రైజ్

24 Sep, 2023 23:00 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో మూడోవారం కూడా అయిపోయింది. వారమంతా ఎలా ఉన్న వీకెండ్‌లో ఓవైఫు ఫన్ ఉన్నప్పటికీ, ఓ హౌస్‌మేట్‌ని ఎలిమినేట్ కావడం గ్యారంటీ. గత రెండు వారాల్లానే ఈ వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ వెళ్లిపోయింది. పోతూ పోతూ శివాజీతో వాదన పెట్టుకుంది. ఆమె కరెక్ట్‌గానే చెప్పినా అతడైతే తప్పు ఒప్పుకోలేనట్లే అనిపించింది. ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో ఆదివారం ఏం జరిగిందనేది Day-21 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్.. ఇలా జరగడం ఇదే మొదటిసారి!)

గేమ్‌తో షురూ
శనివారం ఎపిసోడ్‌లో భాగంగా నామినేట్ అయిన ఏడుగురిలో యవర్ సేవ్ అయ్యాడు. ఆదివారం మాత్రం నాగార్జున ఓ పాటతో ఎంట్రీ ఇచ్చాడు. సండే ఫన్‌డే కాబట్టి వచ్చీ రావడంతో 'చిట్టి ప్రశ్నలు' అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా కలర్స్ ఉన్న ఓ చక్రం ఉంటుంది. దానిపై ఉన్న బాణం ఏ రంగుపై ఆగుతుందో, ఆ చీటీ నాగ్ తీస్తాడు. అందులో ప్రశ్నకు ఎవరైతే సూట్ అవుతారో పేరు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆయా కంటెస్టెంట్స్ ని అడిగిన ప్రశ్నలు, వాళ్లు చెప్పిన పేర్లు దిగువన ఉన్నాయి.

కంటెస్టెంట్ - ప్రశ్న- వ్యక్తి పేరు

 • శోభాశెట్టి.. కన్నింగ్ ఎవరు?      ప్రశాంత్ 
 • ప్రశాంత్.. తమ ఆట కోసం ఎవరు వాడుకుంటున్నారు?      శోభాశెట్టి
 • దామిని.. తేనె పూసిన కత్తి ఎవరు?       సందీప్ మాస్టర్
 • సందీప్.. హౌసులో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది ఎవరు?        యవర్
 • యవర్.. వరస్ట్ క్వాలిటీ ఎవరిది? ఏమిటి?        రతిక (ముందు బాగానే ఉంది. వెనక వేరేలా ఉంటుందని కారణం)
 • రతిక.. ఆటలో నిన్ను కిందకు లాగుతున్నది ఎవరు?     యవర్-ప్రశాంత్
 • అమరదీప్.. ఇంట్లో కపటనాటక సూత్రధారి?       శివాజీ
 • శివాజీ.. హౌసులో కలుపుమొక్క ఎవరు?         తేజ
 • తేజ.. ఇంట్లో ఎవరికి పని తక్కువ? తిండి ఎక్కువ?        రతిక
 • శుభశ్రీ.. హర్ట్ చేసి సంతోషం పొందేది ఎవరు?        దామిని
 • ప్రియాంక.. హౌసులో కామన్‌సెన్స్ లేనిది ఎవరికి?        ప్రశాంత్
 • గౌతమ్.. హౌసులో నమ్మకూడదు? ఎందుకు?           తేజ

(ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్న హీరోయిన్ పూజాహెగ్డే)

ప్రమోషన్స్ కోసం రామ్
'స్కంద' సినిమా సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్‌లోకి హీరో రామ్ వచ్చాడు. కాసేపు నాగ్‌తో మాట్లాడిన తర్వాత కంటెస్టెంట్స్‌కి ఓ గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా మ్యూజిక్ ప్లే అవుతుంది. పాట గెస్ చేయాల్సి ఉంటుంది. ఉన్న 12 మందిని రెండు గ్రూపులుగా టీమ్ స్కంద, టీమ్ ఇస్మార్ట్‌గా విభజించారు. ఇందులో టీమ్ స్కంద (అమరదీప్, శివాజీ, తేజ, గౌతమ్, శోభాశెట్టి, దామిని) గెలిచింది.

దామిని ఎలిమినేట్
ఓవైపు ఆదివారం కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడిపిస్తూనే మధ్యమధ్యలో కంటెస్టెంట్స్ సేవ్ అయ్యారు. తొలి రౌండులో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. రెండో రౌండులో రతిక, మూడో రౌండులో అమరదీప్ సేవ్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా మిగిలిన శుభశ్రీ, దామిని యాక్టివిటీ రూంలోకి వచ్చారు. వీళ్లిద్దరిలో దామిని ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఇంట్లో వాళ్లకు టాటా చెప్పేసి, స్టేజీపైకి వెళ్లిపోయింది.

దామినితో శివాజీ వాదన
ఎలానూ వెళ్లిపోతుంది కాబట్టి.. వెళ్తూవెళ్తూ అందరికీ తలో సలహా ఇవ్వమని దామినికి హోస్ట్ నాగార్జున చెప్పాడు. దీంతో అందరికీ సలహాలు ఇచ్చింది. శివాజీ గురించి చెబుతూ.. ఆయన కొందరికీ ఫేవరెట్‌గా ఆడుతున్నాడని, అది వదిలేస్తే బెటర్ అన్నట్లు మాట్లాడింది. హౌసులో ఇదే జరుగుతున్నప్పటికీ.. ఆయన దీన్ని ఒప్పుకోలేదు. దామినితో వాదన పెట్టుకున్నాడు. ఇంటికెళ్లి తన ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇలానే చెబితే అప్పుడు ఒప్పుకొంటానని అన్నాడు. అలానే బిగ్‌బాస్‌పై స్వయంగా తాను రాసిన పాట పాడి అందరినీ సర్ ప్రైజ్ చేసిన దామిని ఇంటికెళ్లిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. 

(ఇదీ చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!)

మరిన్ని వార్తలు