Bigg Boss 7 Day 23 Highlights: నామినేషన్స్ కంటే ఆ గొడవే ఇంట్రెస్టింగ్‌గా ఉందిగా!

26 Sep, 2023 22:47 IST|Sakshi

బిగ్‌బాస్ నాలుగోవారం నామినేషన్స్ ముగిశాయి. ఫైనల్ ఆరుగురి లిస్టులోకి వచ్చారు. అయితే ఈ నామినేషన్స్ వ్యవహారం కంటే బయట జరిగిన గొడవలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అయితే ఈసారి మాత్రం అవాక్కయ్యే గొడవలు జరిగాయి. మిగతా వాటి సంగతేమో గానీ రతికని ప్రశాంత్ అక్క అని పిలవడం ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ మంగళవారం ఎపోసిడ్‌లో ఏం జరిగిందనేది Day-23 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

గౌతమ్ పిచ్చిలేసింది
సోమవారం ఎపిసోడ్‌లో ప్రియాంక, రతిక నామినేట్ అయ్యారు. దీంతో వీళ్ల ఫొటోల్ని జ్యూరీ సభ్యులు గిల్టీ వాల్‌పై అతికించారు. గౌతమ్ తన నామినేషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. యవర్‌ని బోనులో నిలబెట్టిన గౌతమ్.. అతడికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ నామినేట్ జరుగుతున్న సమయంలో శివాజీ తీరుతో విసిగిపోయిన గౌతమ్.. లాయర్‌లా ఒకవైపే సపోర్ట్ చేస్తున్నారని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో మొత్తానికి జ్యూరీ సభ్యులు.. ప్రిన్స్‌ని నామినేట్ చేశారు. అయితే వాదనతో విసిగిపోయిన గౌతమ్.. ఈసారి తనని డైరెక్ట్‌గా నామినేట్ చేస్తే, ఇంటినుంచి బయటకెళ్లిపోతానని సందీప్ తో అని అసహనం వ్యక్తం చేశాడు.

(ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!)

అమరదీప్ vs ప్రశాంత్
తర్వాత వచ్చిన అమరదీప్.. శుభశ్రీ, ప్రశాంత్‌ని బోనులో నిలబెట్టాడు. గత వారం తన ఆడలేక సైడ్ అయిపోయానని, మళ్లీ అదే విషయాన్ని ఎత్తిచూపినందుకు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. అతడు నటిస్తున్నాడని, దాగుడుమూతల దండాకోర్ టైపు గేమ్ ఆడుతున్నాడని అమరదీప్ అన్నాడు. అయితే అమర్ మాట్లాడుతుంటే.. ప్రశాంత్ రెచ్చగొట్టేలా నవ్వుతూ ఉండేసరికి.. సెగలుగా నవ్వకు అని అమరదీప్ సీరియస్ అయ్యాడు. ప్రశాంతంగా ఉండాల్సిన వాదన.. వీళ్లిద్దరి మధ్య సీరియస్ అయింది. ఫైనల్ శుభశ్రీ, ప్రశాంత్ ఇద్దరిలో ఒకరినే సెలెక్ట్ చేయాలి కాబట్టి జ్యూరీ సభ్యులు శుభశ్రీని నామినేట్ చేశారు.

శుభశ్రీ ఏడుపు
తప్పు కారణానికి తనని నామినేట్ చేశారని.. అదొక కారణమా.. సిల్లీయెస్ట్ రీజన్.. ఛీ అని అమరదీప్‌తోనే సీరియస్‌గా అంది. దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో, మనోభావాలు దెబ్బతిన్నాయ్ అట అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ప్రశాంత్.. గౌతమ్, అమరదీప్‌ని బోనులో నిలబెట్టాడు. అమర్ గతవారం గేమ్ లో ముందుకెళ్లకపోవడం తనకు బాగా అనిపించలేదని కారణం చెప్పిన ప్రశాంత్.. అమ్మాయి(శోభాశెట్టి) ముందు షర్ట్ తీసి గౌతమ్ షో హాఫ్ చేయడం తనకు నచ్చలేదని నామినేషన్స్‌కి కారణం చెప్పాడు. ఫైనల్‌గా జ్యూరీ సభ్యులు గౌతమ్‌ని నామినేట్ చేశారు.

(ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ)

రతిక అక్క‍ అయిపోయింది
ఇక ప్రశాంత్ తన నామినేషన్స్ చెబుతున్న సమయంలో రతికతో ప్రశాంత్ కొన్నిరోజుల ముందు బిహేవ్ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. ఆమె సింగిల్ పీస్ డ్రస్ వేసుకుంటే ఏమన్నాడో చెప్పుకొచ్చాడు. దీంతో గొడవ సైడ్ అయిపోయింది. దీంతో రతిక, ప్రశాంత్ వాదన పెట్టుకున్నారు. తను చాలా నార్మల్ గా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. ఎలా పడితే అలా అంటే ఒప్పుకొనేది లేదని రతిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలా కాసేపు వాదించిన తర్వాత.. ఇక నిన్ను రతిక కాదు ఏమని పిలవను కేవలం అక్క అని మాత్రమే పిలుస్తానని రైతుబిడ్డ వరస మార్చేశాడు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే తొలివారం వెంటబడ్డాడు, రెండో వారం గొడవపెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా అక్క అని పిలిచి అపరిచితుడిలా బిహేవ్ చేయడం వింతగా అనిపించింది.

ఆరుగురు నామినేట్
తొలుత జ్యూరీ సభ్యులు ఐదుగురిని నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ కల్పించుకుని.. తేజ, ప్రశాంత్, అమరదీప్‌లలో ఒకరిని నేరుగా సెలెక్ట్ చేయాలని చెప్పాడు. దీంతో జ్యూరీ(శోభాశెట్టి, శివాజీ, సందీప్).. తేజని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేట్ చేశారు. తనని నామినేట్ చేయడంపై తేజ.. కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. మరోవైపు రాత్రి కిచెన్‌లో శుభశ్రీ, అమరదీప్ గొడవపడ్డారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. 

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్)

మరిన్ని వార్తలు