Bigg Boss 7 Day 25 Highlights: శివాజీ మళ్లీ అదే కామెంట్స్.. బిగ్‌బాస్ సీరియస్ అయితే!

28 Sep, 2023 22:54 IST|Sakshi

'బిగ్‌బాస్'లో అందరూ ఆడటానికే వచ్చారు. శివాజీ మాత్రం అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నారు. వద్దని చెప్పినా సరే తీరు మార్చుకోవట్లేదు. అలానే ఆట తక్కువ సోది ఎక్కువ అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా పక్కనబెడితే 'బిగ్‌బాస్' నాలుగో పవరస్త్ర కోసం పోటీదారులు రెడీ అయిపోయారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఏంటనేది ఇప్పుడు Day-25 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

తిండి కోసం గొడవ
గురువారం జరిగిన బజర్ గేమ్‌లో అమరదీప్-గౌతమ్ జట్టుగా వెళ్లి విజయం సాధించారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. తర్వాతి రోజు తెల్లారడంతో గురువారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే అందరూ కిచెన్‌లో భోజనం చేస్తుంటే.. యవర్, ప్రశాంత్ మాత్రం బజర్ ప్రెస్ చేయాలనే తాపత్రయంతో దాని దగ్గరే కూర్చుని తిన్నారు. ఈ క్రమంలోనే యవర్.. శివాజీని చపాతీలు తీసుకుని రమ్మని అన్నాడు. అక్కడ గొడవ షురూ అయింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?)

సందీప్ vs యవర్
అయితే బజర్ దగ్గర కూర్చుని తినడం ఎందుకు? అది స్వార్థం అవుతుంది కదా? అంత ఉంటే మంచిది కాదని సందీప్ మాస్టర్ యవర్‌తో అన్నాడు. దీంతో వీళ్లిద్దరూ మాటలతో కొట్టుకున్నంత పనిచేశారు. ఈ క్రమంలోనే తన ప్లేటుని కిచెన్‌లో వెళ్లిపోయాడు. దీంతో ప్రియాంక, యవర్‌తో వాదించింది. అలా యవర్ గొడవ కాస్త శివాజీ, శోభాశెట్టి గొడవగా మారింది. 'ఈ ఇంట్లో ఎవరికీ లేదు, మీకు మాత్రమే ప్రతిదాన్ని గొడవ చేయాలని మీకే ఉంది' అని శివాజీపై శోభా రెచ్చిపోయింది.

యవర్ సక్సెస్
గురవారం బజర్ ప్రెస్ చేసిన యవర్.. ప్రశాంత్‌ని తన పార్టనర్‌గా ఎంచుకున్నాడు. అమరదీప్-గౌతమ్‌ని ప్రత్యర్థి జట్టుగా సెలెక్ట్ చేశాడు. వీళ్లకు కన్నీళ్లతో గ్లాస్ నింపాలనే పిచ్చి గేమ్‌ని బిగ్‌బాస్ పెట్టాడు. ఎలాగైతేనేం ప్రశాంత్-యవర్ ఇందులో విజయం సాధించారు. ఆ తర్వాత మరోసారి బజర్ గేమ్ ఉందనుకున్నారు కానీ టాస్క్ పూర్తయిందని చెప్పిన బిగ్‌బాస్ అందరికీ షాకిచ్చాడు. దీంతో 118, 110 కాయిన్స్‌తో టాప్ లో నిలిచన యవర్, ప్రశాంత్ నాలుగో పవరస్త్ర కోసం అర్హత సాధించారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో సిద్ధార్థ్‌కి నిరసన సెగ.. ఆ గొడవ వల్లే!)

శివాజీ మళ్లీ అదేగోల
హౌసులో ఫస్ట్ వారం బాగానే ఉన్న శివాజీ.. రెండోవారం వచ్చేసరికి బయటకెళ్లిపోతా, బయటకెళ్లిపోతా అని పలుమార్లు అన్నాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో చిన్న వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇక అలా అననని చెప్పుకొచ్చాడు. తాజాగా గురువారం ఎపిసోడ్‌లో రతిక మాట్లాడుతూ.. 'ఉండబుద్ది అయితేలే బిడ్డా, కావట్లే..!' అని మరోసారి శివాజీ అన్నాడు. రతిక మరీ మరీ అడిగినా 'ఒట్టమ్మా, ఇన్నిరోజులు దాసుకుని ఉండటం నా వల్ల కావట్లేదు' అని అన్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాగ్ ఇప్పటికే చెప్పినా శివాజీ ఇలా అనడం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్లే. బిగ్‌బాస్ దీనిపై సీరియస్ అయితే మాత్రం శివాజీని ఇంటికి పంపేచేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

టాస్క్ అయిపోవడంతో బీబీ గాలా నైట్ అని స్పెషల్ ఈవెంట్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని దొరికిన వస్తువులతో కంటెస్టెంట్స్ అందరూ ఎలా పడితే అలా రెడీ అయ్యారు. వాళ్లలో ఎవరు బిగ్‌బాస్‌ని మెప్పిస్తే వాళ్లో.. నాలుగో పవరస్త్ర కోసం మూడో కంటెండర్‌గా నిలుస్తారని చెప్పాడు. వాళ్లలో ప్రశాంత్, తేజ, ప్రియాంక, యవర్ ర్యాంప్ వాక్ చేశారు. అలా గురువారం ఎపిసోడ్ పూర్తయింది. 

(ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ)

మరిన్ని వార్తలు