బిగ్‌బాస్ 7లో రైతుబిడ్డ అనుకున్నది సాధించాడు. వాళ్లని ఓడించి సక్సెస్ అయ్యాడు. తనని గెలవనివ్వకూడదని రతిక చాలా ప్రయత్నించింది. కానీ అది సాధ్యపడలేదు. అలానే హౌసులో కీలకమైన గేమ్‌లో తను విజేత కాకపోవడంపై అమరదీప్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఇలా కాస్త బోరింగ్, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో శుక్రవారం ఎపిసోడ్ సాగింది. ఓవరాల్‌గా ఏమైందనేది Day 26 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
గలాటాలో గలాటా
బజర్ రౌండులో ఎక్కువ కాయిన్స్ గెలుచుకుని టాప్-2లో ఉన్న యవర్-ప్రశాంత్.. నాలుగో పవరస్త్ర పోటీలో నిలిచారు. వీళ్లకు పోటీగా మూడో కంటెండర్ కోసం బిగ్‌బాస్.. 'బిగ్‌బాస్ గలాటా' పేరుతో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ఇంట్లోని వస్తువులతో క్రియేటివ్‌గా రెడీ అవ్వాలి. గురువారం ఈ గేమ్ కొంతవరకు జరిగింది. శుక్రవారం మిగతాది జరిగింది. ఫైనల్‌గా శుభశ్రీని విజేతగా ప్రకటించారు. అయితే ఆమెనే ఎందుకు విన్నర్ అని ప్రకటించారంటూ అమరదీప్, జడ్జిలతో గొడవ పెట్టుకున్నాడు. కాసేపట్లో అది ఆగిపోయింది.
(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)
శివాజీ అదే గోల
ఇకపోతే గలాటా ఆట విజేత ప్రకటించిన తర్వాత అమరదీప్ తనతో గొడవ పెట్టుకోవడాన్ని శివాజీ తట్టుకోలేకపోయాడు. హౌస్‌మేట్ కావడం వేస్ట్, కంటెస్టెంట్‌గా ఉండటమే బెటర్ అని యవర్‌తో మాట్లాడుతూ అన్నాడు. మొదటివారంలో హోస్ట్ నాగార్జున.. ఇలా అనొద్దని శివాజీతో చెప్పినా సరే అతడు తీరు మార్చుకోకుండా అదే పాట పాడుతున్నాడు. రతిక కూడా తన దగ్గరకొచ్చి గేమ్ గురించి అడిగేసరికి.. నన్ను ఈ వారం ఎలిమినేట్ చేసేయ్ బిగ్‌బాస్ అని శివాజీ సోది ముచ్చట చెప్పుకొన్నాడు.
పట్టు వదల్లేదు
నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ మధ్య బిగ్‌బాస్... 'పట్టు వదలకురా డింభకా' పేరుతో ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒకే పవరస్త్రని ముగ్గురు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డ్రాప్ అవుతారో వాళ్లు ఓడిపోయినట్లని చెప్పారు. ఇది దాదాపు మూడు గంటలపాటు సాగిన ఫలితం తేలలేదు. దీంతో పవరస్త్ర బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు. దీంట్లో యవర్, శుభశ్రీ త్వరగా ఔటయ్యారు. దీంతో ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో యవర్ మళ్లీ బాధపడ్డాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?)