Bigg Boss 7 Day 27 Highlights: సందీప్ అడ్డంగా బుక్కయ్యాడు.. చివరలో జస్ట్ మిస్!

30 Sep, 2023 23:03 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ మంచి క్రేజీగా ఉంటుంది. అయితే గత మూడు శనివారాలు పెద్దగా ఎంటర్‌టైన్ చేయలేకపోయాయి. ఈసారి మాత్రం వాదన-ప్రతివాదనలతో హీటెక్కిపోయింది. నాగార్జున ప్రతి ఒక్కరిపై కౌంటర్స్ వేశారు. మరి ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో శనివారం ఏం జరిగిందనేది Day 27 హైలైట్స్‌‌లో ఇప్పుడు చూద్దాం.

సందీప్ గట్టిగా పడ్డాయ్
స్టేజీపైకి వచ్చీ రావడంతోనే శుక్రవారం ఏం జరిగిందో చూసిన నాగార్జున.. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశారు. అస్సలు లేటు చేయకుండా సంచాలక్ సందీప్‌తో నాగ్ మాట్లాడారు. 'నువ్వేమైనా గుడ్డోడివా, నీ కళ్లముందు ఏం జరుగుతుందో కనబడట్లేదా?' అని స్మైల్ ప్లీజ్ టాస్కులో తేజ, గౌతమ్ మెడపై తాడు వేసి లాగడం గురించి అడిగారు. ఆ సమయంలో సంచాలక్ అయినా సైలెంట్‌గా ఉండటం తప్పే అని నాగ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. సంచాలక్‌గా పూర్తిగా ఫెయిలయ్యావ్ అంటూ నాగ్ ఖరాఖండీగా చెప్పేశాడు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!)

శివాజీ పరువు పాయే
అదే టాస్కులో ఫొటోలు తీస్తున్న మరో సంచాలక్ అయిన శివాజీపై కూడా నాగ్ కౌంటర్స్ వేశాడు. 'కెమెరా నుంచి నీకు ఏం జరుగుతుందో కనబడట్లేదా?' అని అన్నాడు. తాను అరిచానని శివాజీ చెబితే, నువ్వు గౌతమ్, తేజని లాగుతున్నప్పుడు అరిచావ్ తప్పితే తేజ, గౌతమ్ ని మెడపై తాడు పెట్టి లాగుతున్నప్పుడు అరవలేదని వీడియో ప్లే చేశాడు. దీంతో శివాజీ పరువు పోయినట్లయింది. 'హౌసులో నువ్వు వీక్ కంటెస్టెంట్స్ తరఫున, న్యాయం వైపు ఉంటావని నేను నమ్ముతున్నాను. కానీ ఇది చూసినప్పుడు నాకు న్యాయం అనిపించలేదు' అని శివాజీ బిహేవియర్ గురించి నాగ్ కుండబద్దలు కొట్టేశాడు.

తేజకి పనిష్మెంట్
ఇక తప్పు చేసిన తేజని ఎందుకలా చేశావ్? అని నాగ్ అడగ్గా.. తనకు ఆ సమయంలో ఏం చేస్తున్నానో మొదట ఐడియా రాలేదని అన్నాడు. తెలిసిన తర్వాత ఆపేశానని తన వాదన చెప్పాడు. అయితే లేడీ కంటెస్టెంట్స్ ఆపమని చెబుతున్నా కూడా ఎందుకు ఆపలేదని నాగ్ అడగ్గా.. అది ఎంకరేజ్‌మెంట్ అనుకున్నానని తేజ అన్నాడు. దీనిపై నాగ్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి తేజని ఏం చేద్దామంటావ్ అని సంచాలక్ సందీప్‌ని అడగ్గా.. హౌస్ నుంచి పంపేస్తే బెటర్ అని అన్నాడు. కానీ హౌసులో ఉన్నోళ్లు అందరి నిర్ణయం బట్టి.. తేజని జైలులో పెట్టడంతోపాటు ఇంటి పనులన్నీ చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు. ఈ తప్పు చేసినందుకు గానూ వచ్చే వారం నేరుగా నామినేట్ చేస్తున్నట్లు నాగ్ అల్టిమేటం ఇచ్చారు.

(ఇదీ చదవండి: రతిక మంచి అమ్మాయి, తనను వాడుకున్నారు.. స్క్రీన్‌షాట్‌ వైరల్‌)

శుభశ్రీ, గౌతమ్‌పై కౌంటర్స్
క్యాష్ టాస్కులో శివాజీ.. తన పైపైకి రావడం గురించి శుభశ్రీ చెప్పింది. తనకు ఇబ్బందిగా అనిపించదని అనగా.. హౌస్‌మేట్స్ అందరితో మాట్లాడిన తర్వాత అది గేమ్‌లో భాగంగా జరిగిందని నాగ్ అన్నాడు. అలానే నామినేషన్స్‌లో భాగంగా ప్రశాంత్ చెప్పిన విషయమై గౌతమ్‌ని నాగ్ అడిగాడు. వీడియో ప్లే చేయగా ప్రశాంత్ చెప్పిందే నిజమని తేలింది. దీని తర్వాత ఇప్పటికే హౌస్‌మేట్స్ అయిన వారిలో ఎవరు అనర్హులు అనుకుంటున్నారని.. కన్ఫెషన్ రూంలోకి ఒక్కొక్కరికి పిలిచి మరీ నాగ్ అడిగాడు. కంటెస్టెంట్- చెప్పిన హౌస్‌మేట్ పేరు

  • యవర్ - సందీప్
  • రతిక - శివాజీ
  • అమరదీప్ - శివాజీ
  • తేజ - ఎవరూ లేరు
  • ప్రశాంత్ - సందీప్
  • శుభశ్రీ - సందీప్
  • ప్రియాంక - ఎవరూ లేరు
  • గౌతమ్ - శివాజీ

అయితే కన్ఫెషన్ రూంలోకి పిలిచి అడగ్గా.. సందీప్, శివాజీని చెరో ముగ్గురు నామినేట్ చేశారు. మళ్లీ బయటకొచ్చిన తర‍్వాత అందరినీ అడగ్గా.. సందీప్‌ని ముగ్గురు, శివాజీని ఏకంగా ఆరుగురు నామినేట్ చేస్తున్నట్లు చేతులు పైకెత్తారు. కన్ఫెషన్ రూంలో ఎవరి పేరు చెప్పన ప్రియాంక-తేజ.. బయటకొచ్చిన తర్వాత శివాజీ పేరు చెప్పారు. శోభాశెట్టి కూడా శివాజీ పేరు చెప్పింది. అలా హౌస్‌మేట్‌గా ఉన్న శివాజీ తన ప్రవర్తన కారణంగా హౌసులోని వాళ్లకు నచ్చక తిరిగి కంటెస్టెంట్ అయ్యాడు. దీంతో అతడి పవరస్త్రని వెనక్కి తీసుకున‍్నారు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే ఆ దురదృష్టవంతులు ఎవరనేది తెలుస్తుంది. అ‍ప్పటివరకు Stay Tune To సాక్షి!

(ఇదీ చదవండి: 'వినయ విధేయ రామ' బ్యూటీపై క్యాస్టింగ్ కౌచ్.. షాకింగ్ కామెంట్స్)

మరిన్ని వార్తలు