Bigg Boss 7 Day 30 Highlights: ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్.. శివాజీ వింత ప్రవర్తన!

3 Oct, 2023 22:58 IST|Sakshi

'బిగ్‌బాస్'లో నాలుగోవారం దాదాపు అందరూ నామినేట్ అయిపోయారు. పవరస్త్ర ఉన్న ముగ్గురు తప్పితే అందరూ నామినేషన్స్‪‌లో ఉన్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజాగా బిగ్‪‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇచ్చిన పవరస్త్రలు అన్నీ లాగేసుకున్నాడు. అలానే కెప్టెన్సీ టాస్క్ కోసం గేమ్స్ మొదలుపెట్టాడు. దీంతో తొలిరోజే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 30 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 20 సినిమాల్లో ఒక్కటే హిట్!)

బిగ్‌బాస్ ఫిట్టింగ్
నామినేషన్స్ పూర్తి కావడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. ఆ తర్వాత కిచెన్‌లో గౌతమ్-శుభశ్రీ మాట్లాడుతున్న టైంలో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇక అందరినీ ఒక్కచోట కూర్చోబెట్టిన బిగ్‌బాస్.. పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పటివరకు పవరస్త్రలు ఉన్న శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్.. వాటిని తిరిగిచ్చేయాలని చెప్పాడు. దీంతో వీళ్ల ముగ్గురు అవాక్కయ్యారు. శివాజీ మాత్రం శునకానందం పొందాడు. శివాజీ ఇలా చేయడంపై శోభాశెట్టి తనలో తానే అసహనం వ్యక్తం చేసింది. 

గేమ్ స్టార్ట్
గత నాలుగు వారాలు కూడా పవరస్త్ర ఉన్నోళ్లే గేమ్స్ ఆడలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర పవరస్త్ర లేదు కాబట్టి అందరూ ఆడేలా బిగ్‌బాస్ గేమ్ డిజైన్ చేశాడు. ఇందులో భాగంగా.. ఈ ఇంట్లో అత్యంత దగ్గరైనవారు, మీ నమ్మకాన్ని పొందేవారు, మీ వెన్నుదన్నుగా నిలిచేవారు, మీ బడ్డీస్ ఎవరో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రక్రియలో మీ బడ్డీతో జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని, మీరు తీసుకునే నిర్ణయం ఈ వారం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో గౌతమ్ - శుభశ్రీ, శివాజీ - ప్రశాంత్, అమరదీప్ - సందీప్, ప్రియాంక - శోభాశెట్టి, యవర్ - తేజ జోడీగా విడిపోయారు.

(ఇదీ చదవండి: థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?)

గేమ్ తెచ్చిన పెంట
అయితే ఈ గేమ్‌లో భాగంగా స్మైల్ ఆకారంలో ఉన్న బొమ్మలో నంబర్స్ ఉన్న కొన్ని దంతాను ఉండవు. లాన్‌లో ఉన్న రెండు ఏరియాల నుంచి పాకుకుని వెళ్లి, యాక్టివిటీ ఏరియాలోని ప్లేసుల్లో నంబర్స్ వెతకాలి. వాటిని తమకిచ్చిన పళ్ల ఆకారంలో అతికించి, అది పూర్తయిన తర్వాత గంట మోగించాలని చెప్పాడు. ఈ ఆటలో గెలిచిన వాళ్లు మొదటి కెప్టెన్సీ దక్కడంతో పాటు సూపర్ ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. అలానే ఈ వారం, వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని అన్నాడు.

స్మైల్ కంప్లీట్ చేసే టాస్కులో తొలుత నంబర్స్ ఫిట్ చేసిన తర్వాత శివాజీ-ప్రశాంత్ జోడీ బెల్ కొట్టారు. వీళ్లేమో నంబర్స్ సరిగా ఫిట్ చేయలేదు. తర్వాత బెల్ కొట్టిన అమరదీప్-సందీప్ జోడీ పూర్తి చేయకముందే బెల్ కొట్టారు. అనంతరం శోభా-ప్రియాంక, శుభశ్రీ- గౌతమ్ పెట్టారు. బజర్ మోగిన తర్వాత యవర్-తేజ ఈ టాస్కుని పూర్తి చేశారు. అయితే అందరూ తప్పులు చేయడంతో సంచాలక్స్‌గా వ్యవహరించిన యవర్-శోభాశెట్టి ఏదీ తేల్చుకోలేకపోయారు. కొన్ని గంటలపాటు చర్చలు జరిగిన తర్వాత కొన్ని గంటలపాటు చర్చోపచర్చలు సాగిన తర్వాత తొలిస్థానం గౌతమ్-శుభశ్రీ, రెండో స్థానం అమరదీప్-సందీప్, మూడో స్థానం శివాజీ-ప్రశాంత్ అని చెప్పారు. అయితే పాయింట్స్ గెలుస్తామనుకున్న తమ టీమ్ నాలుగో స్థానికి పరిమితం కావడంపై ప్రియాంక ఒప్పుకోలేదు. అలా మాట్లాడుతుండగానే మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!)

మరిన్ని వార్తలు