Bigg Boss 7 Day 50 Highlights: శివాజీని లాజిక్‌తో కొట్టిన శోభా.. దెబ్బకి తత్తరపడిపోయాడు!

23 Oct, 2023 23:05 IST|Sakshi

బిగ్‌బాస్‌ 7 నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్ మళ్లీ మాటలతో కొట్టేసుకున్నారు. పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ వస్తున్న శివాజీ నిజస్వరూపాన్ని శోభాశెట్టి బయటపెట్టేసింది. ఇక భోలె గురించి అయితే చెప్పనక్కర్లేదు. గతవారంలానే ఇరిటేట్ చేశాడు. లాజిక్ అనేది లేకుండా ఏదేదో మాట్లాడాడు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 50 హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?)

రతిక గురించి డిస్కషన్
పూజామూర్తి ఎలిమినేట్, రతిక రీఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. పొద్దుపొద్దునే రతిక గురించి రైతుబిడ్డ-పాటబిడ్డ బాత్రూంలో డిస్కషన్ పెట్టారు. రతిక తిరిగొచ్చింది కదా? ఎలా అనిపిస్తుందని భోలె, ప్రశాంత్‌ని అడిగాడు. దీంతో ప్రశాంత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడీ ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడురా బాబు అని అనుకున్నాడు. ఎందుకు దిగాలుగా కనిపిస్తున్నావ్? అని భోలె అడగ్గా.. నాన్న వీడియో చూశా కదా! అందుకని అన్నాడు. దీంతో భోలె చల్లబడ్డాడు.

రతికపై బిగ్‌బాస్ ప్రేమ
రతికపై బిగ్‌బాస్‌కి ఎంత ప్రేముందో మళ్లీ రుజువైంది. ప్రేక్షకులే మాకు ఈమె వద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేసినా, పక్కా ప్లాన్ చేసి మరీ రీఎంట్రీ పేరుతో రతికని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ వారం అస్సలు ఆమెని నామినేట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. ఆమె గురించి చెప్పడానికి కంటెస్టెంట్ దగ్గరు ఎలానూ రీజన్స్ ఉండవు. కాబట్టి రతికని నామినేట్ చేయరు. అయినా సరే బిగ్‌బాస్ ప్రత్యేకించి చెప్పడం రతికపై ప్రేమ ఎక్కువైపోయినట్లు అనిపించింది. 

(ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?)

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • శివాజీ - శోభాశెట్టి, ప్రియాంక
  • అశ్విని - శోభాశెట్టి, ప్రియాంక
  • గౌతమ్ - ప్రశాంత్, భోలె
  • ప్రియాంక - భోలె, అశ్విని
  • సందీప్ - అశ్విని, భోలె
  • శోభాశెట్టి - శివాజీ, యవర్
  • భోలె - శోభాశెట్టి, గౌతమ్

లాజిక్స్ మర్చిపోతున్న శివాజీ
ఫస్ట్ ఫస్ట్ శివాజీతో నామినేషన్స్ మొదలయ్యాయి. గతవారం నామినేషన్స్ సందర్భంగా భోలెతో గొడవపడటం తనకు నచ్చలేదని చెప్పి శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు.పెద్దోడు కదా సారీ చెప్పిన తర్వాత కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని శోభాతో అన్నాడు. శివాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పెద్దోడు అయితే బూతులు తిట్టేసి సారీ చెబితే క్షమించేయాలేమో? 

(ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్)

ఇచ్చిపడేసిన శోభా
ఇక తన నామినేషన్స్ సందర్భంగా శోభాశెట్టి, శివాజీకి ఇచ్చిపడేసింది. 'భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పొచ్చు. లేదంటే వీకెండ్‌లో అయినా చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్‌లో మాత్రమే చెప్పి, ప్రేక్షకులందరిముందు నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నారా?' అని శివాజీని అడిగింది. పైకి పెద్దమనిషి అని చెప్పుకొని.. మనుషుల్ని శివాజీ ఎలా బ్యాడ్ చేస్తున్నాడనేది శోభా ప్రశ్నతో ప్రూవ్ అయింది. అతడి నిజస్వరూపాన్ని బయటపడింది.

శివాజీ ఆట చూస్తే ఒకటి మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. మాట వినేవాళ్లని మంచి చేసుకోవడం, అలా కాదంటే మెంటల్‌గా డౌన్ చేయడం. అమరదీప్‌ని తొలివారం నుంచి అలానే టార్గెట్ చేశాడు. అతడిని మెంటల్‌గా డిస్ట్రబ్ చేసి అల్లకల్లోలం చేశాడు. నువ్వు తోపు, తురుము అనేసరికి అమరదీప్ సరిగా కాన్సట్రేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే టెక్నిక్ శోభా మీద ప్రయోగిద్దామని శివాజీ చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్స్‌లో శోభాని ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?)

మరిన్ని వార్తలు