Bigg Boss 7 Day 93 Highlights: సీరియల్ బ్యాచ్ వింత బిహేవియర్.. శోభా-అమర్-ప్రియాంక చివరకు అలా!

5 Dec, 2023 23:02 IST|Sakshi

బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్‌లో చూద్దాం.

రైతుబిడ్డ ఎదురుదెబ్బ
నామినేషన్స్‌లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్‌తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్‌ని  రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా)

ఓటు అప్పీలుకు ఛాన్స్
చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్‌బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్‪‌పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్‌లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది.

అమర్ కాదు అపరిచితుడు
ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!)

అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్‌లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్‌కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట‍్రెయిట్‌గా చేయాల్సిన పని స్ట్రెయిట్‌గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్‌కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు.

ఓటు ఫర్ అప్పీలు టాస్క్
పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్‌బాస్‌లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?)

6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్‌బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది.

ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్‌లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్‌లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్‌గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్‌గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్‌లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌!)

>
మరిన్ని వార్తలు