Bigg Boss Telugu 7: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి!

22 Sep, 2023 08:18 IST|Sakshi

Day 18 హైలైట్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్‌ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్‌లుపెడుతున్నాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్‌ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్‌ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్‌లో తాజా ఎపిసోడ్‌లో (సెప్టెంబర్‌ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం..

చికెన్‌ ముక్కల్ని లాగించిన శోభా
మూడో పవరాస్త్ర కోసం బిగ్‌బాస్‌.. ప్రిన్స్‌ యావర్‌, అమర్‌దీప్‌, శోభా శెట్టిని సెలక్ట్‌ చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్‌గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్‌. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్‌బాస్‌. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్‌ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్‌ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా.

గౌతమ్‌ కదా విన్నర్‌?
ఇక ఆమె కంటెండర్‌గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్‌ చేసిన పల్లవి ప్రశాంత్‌, శుభశ్రీ రాయగురు, గౌతమ్‌ కృష్ణలకు సేమ్‌ టాస్క్‌ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్‌ పీసులు తినాలని చెప్తూ సందీప్‌ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్‌ 28 తినేసి బెల్‌ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సంచాలక్‌.. తర్వాత మాత్రం ఒక పీస్‌ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్‌ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్‌బాస్‌ ఆమెనే కంటెండర్‌గా ఎంపిక చేశాడు.

గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్‌
ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్‌దీప్‌.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. అమర్‌దీప్‌ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్‌ చేసిన ప్రియాంక బేబీకట్‌ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్‌.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్‌. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్‌కట్‌ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్‌కట్‌కు రెడీ అయిపోయింది ప్రియాంక.

అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక..
అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్‌గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్‌బాస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్‌ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్‌ పొందుతారా? లేదా? అనేది చూడాలి.

చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా

మరిన్ని వార్తలు