Bigg Boss 7: అమర్, శోభా తప్పులు.. నాగ్ అడిగితే నో ఆన్సర్!

23 Sep, 2023 17:10 IST|Sakshi

'బిగ్‌బాస్' షో అంటే నామినేషన్స్, కంటెస్టెంట్స్ మధ్యగొడవలు, వీకెండ్ లో నాగార్జున ప్రతి ఒక్కరికీ వేసే కౌంటర్స్ ఇలా ఉండాలి. కానీ ఈసారి అలాంటివి ఏం లేకుండా మూడో వారం చివరకొచ్చేసింది. ఇలాంటి టైంలో నాగ్ రూట్ మార్చారు. హౌసులో సీరియల్ బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న అమరదీప్, శోభాశెట్టిని నాగ్ ఓ రేంజులో ఆటాడేసుకున్నాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది?

ముందు పెట్టిన గేమ్‌లో అమరదీప్‌తో మరో ఇద్దరు కూడా ఫెయిలయ్యారు. ఈ కారణంతో అతడు గేమ్ ఆడటానికి అనర్హుడని ప్రియాంక చెప్పింది. ఈ విషయాన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. దీన్ని ఒప్పుకొంటున్నావా? అని అమరదీప్ నే డైరెక్ట్‌గా అడిగేశాడు. దీంతో అతడు తల అడ్డంగా ఊపుతూ నో అన్నాడు. అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు బయటపెట్టుకోలేదని అమర్‌ని నాగ్ అడిగాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'అసలు నువ్వు నీకోసం ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?' అని ఓ రేంజులో అమరదీప్‌కి నాగార్జున ఇ‍చ్చిపడేశాడు. తన కోసమే తాను ఆడుతున్నా అని అమర్ చెప్పగా.. మరే అదే పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేశావ్ అని నాగ్ ఆటాడేసుకున్నాడు.వీకెస్ట్ (బలహీనమైన) కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయమన్నారు, మరి నువ్వేమన్నావ్.. యవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి, సైడ్ చేసేశావ్. అంటే దీనిబట్టి నువ్వు వీక్ కంటెస్టెంట్ అని ఒప్పుకొంటున్నట్లే కదా అని శోభాశెట్టితో నాగ్ అన్నాడు. దీంతో ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 

అలానే సంచాలక్‌గా సందీప్ ఫెయిలయ్యాడని నాగ్ ఇచ్చిపడేశాడు. ఆట మధ్యలో అసలు ఇన్వాల్స్ కాకూడదు, మరి నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అని సందీప్‌ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు. హౌజులో ఉన్నవాళ్ల అభిప్రాయం తీసుకుని.. అతడి బ్యాటరీ లెవల్ పచ్చ నుంచి పసుపునకు తగ్గించాడు. ప్రోమో చూస్తుంటే ఈసారి మంచి హీట్ ఉండబోతుందనిపిస్తుంది. అదే టైంలో ప్రోమో చూసి మోసపోవద్దని కూడా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?)

మరిన్ని వార్తలు