Shakeela: రెండు వారాలకు షకీల ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?

18 Sep, 2023 15:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ షో.. ఇక్కడికి కొందరు పేరు కోసం వస్తారు. మరికొందరు డబ్బు కోసం వస్తారు. కానీ కొందరే మంచి పేరుతో బయటకు వెళ్తుంటారు. మిగతావాళ్లంతా అప్పటివరకు ఉన్న పేరును కూడా చెడగొట్టుకుంటారు. తమ ప్రవర్తనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుని అప్రతిష్టపాలవుతారు. అందుకే బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చినప్పటికీ ఎంతోమంది దాన్ని రిజెక్ట్‌ చేస్తూ ఉంటారు. అతికొద్ది మంది మాత్రమే ట్రై చేస్తే పోలా అని హౌస్‌లో అడుగుపెడతారు. అలా ఈ సీజన్‌లోనూ ఓ కంటెస్టెంట్‌ హౌస్‌లో అడుగుపెట్టింది. ఆవిడే షకీలా.

కేవలం తనకు పిలుపు వచ్చింది కదా అని ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఒక రకంగా ఆమె ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేయడం వల్ల మంచే జరిగింది. శృంగార తారగా అప్పటివరకు గుర్తింపు ఉన్న ఆమె.. బిగ్‌బాస్‌ పుణ్యమా అని షకీలా అమ్మగా మారింది. పద్ధతిగా రెడీ అవుతూ, అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ, కుటుంబ పెద్దగా ఎంతో హుందాగా వ్యవహరించింది. అయితే నామినేషన్స్‌ అంటే చాలు బెంబేలెత్తిపోయేది షకీలా.

చివరకు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్న ఆమె హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. మరి బిగ్‌బాస్‌ నుంచి షకీలా ఎంత డబ్బు తీసుకుందనుకుంటున్నారు? అక్షరాలా మూడు లక్షల 75 వేలు. ఇది రెండు వారాలకు అనుకునేరు, కాదు! ఆమె ఒక్క వారానికే మూడున్నర లక్షల పై చిలుకు పారితోషికం తీసుకుంది. ఈ లెక్కన ఆమె రెండు వారాలకుగానూ దాదాపు రూ.7 లక్షల పైనే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: గీతూ సూటి ప్రశ్నలు.. నువ్వేంటి నన్ను అడిగేదని షకీలా ఫైర్‌.. రతికా గురించి ఏం చెప్పిందంటే?
 షకీలా ఎలిమినేట్.. కొన్నాళ్లు ఈమెని ఉంచాల్సింది!

మరిన్ని వార్తలు