బిగ్‌బాస్‌ విన్నర్‌ తండ్రికి అస్వస్థత

3 Mar, 2021 16:10 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విన్నర్‌ గౌహర్‌ ఖాన్‌ తండ్రి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి చేర్పించారు. ఈ విషయాన్ని గౌహర్‌ ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వెల్లడించింది. 'నా జీవితం నా పప్పా..' అంటూ అతడి చేయి పట్టుకుని ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన తండ్రి వెంటనే కోలుకోవాలని ప్రార్థించండి అని ఫ్యాన్స్‌ను కోరింది. ఇక తండ్రిని చూసుకునేందుకు ఆమె షూటింగ్‌కు బ్రేక్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత్రి రెండు గంటలైనా కంటి మీద కునుకు లేకుండా తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నానని ఓ ఫొటోను పంచుకుంది.

కాగా ఈ బాలీవుడ్‌ నటి, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను డిసెంబర్‌ 25న పెళ్లాడింది. కోవిడ్‌ కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. జైద్‌ కంటే గౌహర్‌ ఎనిమిదేళ్లు పెద్దదైనప్పటికీ వారిది స్వచ్ఛమైన ప్రేమ అని, పెళ్లికి వయసుతో పని లేదంటూ వారి షాదీ దగ్గరుండి జరిపించాడు జైద్‌ తండ్రి, బాలీవుడ్‌ కంపోజర్‌ ఇస్మాయిల్‌ దర్బార్. కాగా మాజీ మోడల్‌ అయిన గౌహర్‌ అనేక టీవీ షోలలో కనిపించింది. హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్‌లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చింది. ఇటీవలే ఆమె తాండవ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ వెబ్‌ సిరీస్‌లో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించాడు.

చదవండి:  భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్‌

మండుటెండల్లో బాలీవుడ్‌ నటి డెడికేషన్‌, 4 రోజులుగా

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో శ్రీరెడ్డి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు