Pooja Ramachandran: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్

29 Apr, 2023 23:03 IST|Sakshi

టాలీవుడ్‌లో నిఖిల్ హీరోగా నటించిన 'స్వామి రారా' నటి పూజా రామచంద్రన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొక్కెన్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. బాబు వేలిని పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. అప్పుడే తమ బిడ్డకు కియాన్ కొక్కెన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. 

(ఇది చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం మీటర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..)

తమిళంలో బిగ్ బాస్‌ ద్వారా పూజాకు ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కాంచన-2, దోచేయ్, త్రిపుర, దళం, వెంకీమామ, పవర్‌ ప్లే లాంటి సినిమాల్లో నటించారు. మరో వైపు ఆమె భర్త జాన్ కొక‍్కెన్ విలన్‌గా పలు చిత్రాల్లో మెప్పించారు. ముఖ్యంగా కేజీఎఫ్, కబ్జా, వీరసింహారెడ్డి, తెగింపు లాంటి విలన్‌గా నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. 

A post shared by John Kokken (@highonkokken)

మరిన్ని వార్తలు