లవ్‌ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా

27 May, 2021 13:09 IST|Sakshi

రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో బాగా క్లిక్‌ అయింది అరియానా గ్లోరీ. అయితే ఆమె పేరును అంతా మరిచిపోయారు అనుకునేలోపు తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. తనకు తప్పు అనిపిస్తే ఏకంగా బిగ్‌బాస్‌నే ఎదురించగలిగే సత్తా ఆమెది. అందుకే అరియానాను అందరూ బోల్డ్‌ పాప అని పిలుచుకుంటే ఆమె అభిమానులు మాత్రం గోల్డ్‌ పాప అని పలకరిస్తుంటారు.

తాజాగా అరియానా అభిమానులతో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా తన వాట్సాప్‌ డీపీని, వాల్‌పేపర్‌ను షేర్‌ చేసింది. వాట్సాప్‌ డీపీలో ట్రెడిషనల్‌గా ఉన్న ఈ బ్యూటీ వాల్‌పేపర్‌ మీద మాత్రం ట్రెండీగా రెడీ అయింది. ఈ మధ్య యూట్యూబ్‌ వీడియోలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు.. అసలు ఎలాంటి వీడియోలు చేయాలో అర్థం కావడం లేదని బదులిచ్చింది. నటన, హోస్టింగ్‌.. ఈ రెండింట్లో యాంకరింగ్‌ ఎక్కువ ఇష్టమని, ఆ తర్వాతే యాక్టింగ్‌ అని తేల్చి చెప్పింది. తన ఫేవరెట్‌ పర్సన్‌ తానే అంటూ ఐ లవ్‌ మై సెల్ఫ్‌ అని చెప్పింది.

బిగ్‌బాస్‌ భామ అరియానా గ్లోరీ అదిరే స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ విన్నర్‌ కౌశల్‌ గారిని కలుద్దామనుకున్నానని, కానీ సరైన సమయం దొరకడం లేదని తెలిపింది. అలాగే అవెంజర్‌ బైక్‌ నడపాలన్న తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? అన్న ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా లవ్‌ మ్యారేజే చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది. అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ చాలా కష్టమని అభిప్రాయపడింది.

కానీ లవ్‌ మ్యారేజ్‌ అంటే కూడా కాస్త భయమేనని చెప్పింది. 'నా తిక్కకు, పిచ్చికి, కోపానికి ప్రేమించినవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోవాల్సిందే, లేదంటే చంపి పారేస్తా'నని చెప్పింది. ఇక క్రష్‌ గురించి బయటకు చెప్పనన్న అరియానా కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు 'అరె, భలే ఉన్నాడే ఈ అబ్బాయి' అని మనసులో అనుకుంటానని పేర్కొంది. అభిమానులు కోరిక మేరకు వారికి తన వాట్సాప్‌ నెంబర్‌ ఇవ్వాలనుందని, కానీ అందుకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని కొంటెగా బదులిచ్చింది.

చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు