Divi Vadthya : మరో క్రేజీ ఆఫర్‌ను కొట్టేసిన దివి

7 Aug, 2021 18:19 IST|Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ దివికి యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్‌ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ భామ. బిగ్‌బాస్‌ సీజన్‌-4కు ముందు అంతకుముందు  పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ  బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ఇటీవలె క్యాబ్‌ స్టోరీస్‌తో హీరోయిన్‌గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్‌ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్‌  కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్‌గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు