అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్‌.. స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ

28 Aug, 2022 12:57 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా పాపులర్‌ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్‌ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్‌ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్‌ వెళ్లింది.

ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీ హయ్యర్‌ స్లడీస్‌ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బోల్డ్‌ బ్యూటీ. ఇటీవల ఇన్‌ స్టా లైవ్‌లోకి వచ్చిన పునర్నవి తన డేటింగ్‌ విషయంపై స్పందించింది.

మీరు ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా? అని ఓనెటిజన్‌ ప్రశ్నించగా.. ఎస్‌ అని అన్సర్‌ ఇచ్చింది. అలాగే మీరు వర్జిన్‌ నా? అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా.. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. పునర్నవి చేసిన ఈ చిట్‌ చాల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు