Sweta Varma: రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ను ఇంటికి తెచ్చుకున్న బిగ్‌బాస్ బ్యూటీ

28 Jan, 2022 10:45 IST|Sakshi

శ్వేతా వ‌ర్మ‌.. బిగ్‌బాస్ షోతో జ‌నాల‌కు మ‌రింత చేరువైందీ భామ‌. ఏదైనా స‌రే ఇచ్చిప‌డేద్దాం అంటూ చ‌లాకీగా మాట్లాడే ఈ బ్యూటీకి బైక్ రైడింగ్‌లంటే మ‌హా స‌ర‌దా. తాజాగా ఆమె రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన శ్వేత అందుకు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

'యుగ‌న్ నిర్వాణ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను.. ఈ బైక్‌ను రైడ్ చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది..' అని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చింది. ఈ ఎన్‌ఫీల్డ్ బైక్ నీకు ప‌ర్ఫెక్ట్‌గా సెట్ట‌యిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె అభిమానులు. కాగా శ్వేత..  ప‌చ్చీస్‌, ద రోజ్ విల్లా, ఏకమ్‌, ముగ్గురు మొన‌గాళ్లు, మిఠాయి, మ్యాడ్, గ్యాంగ్ ఆఫ్ గ‌బ్బ‌ర్ సింగ్‌, సంజీవ‌ని, నెగెటివ్ వంటి ప‌లు చిత్రాల్లోనే కాక విష్ యూ హ్యాపీ బ్రేక‌ప్ వంటి వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది.

A post shared by Swetaa varma (@iamswetaavarma)

మరిన్ని వార్తలు