Ajay Kathurvar: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హీరోగా అజయ్‌గాడు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

8 Sep, 2022 19:19 IST|Sakshi

ఇటీవలే 'విశ్వక్‌' సినిమాలో అలరించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అజయ్ కతుర్వార్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను యంగ్‌ హీరో సత్యదేవ్‌ ఆవిష్కరించారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంటుండగా అజయ్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఫైర్ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు అజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు.

A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar)

View this post on Instagram

A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar)

చదవండి: చెర్రీ-ఉపాసనల మేకప్‌ ఆర్టిస్ట్‌తో నటుడి పెళ్లి

మరిన్ని వార్తలు