అందుకే మోనాల్‌ని హీరోయిన్‌గా తీసుకోలేదు : అఖిల్‌

15 Apr, 2021 20:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఫేం అఖిల్‌-మోనాల్‌ జోడీకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ వేర్వేరు ఆఫర్లతో బిజీ బిజీగా మారారు.  అయినప్పటికీ వీరిద్దరు బిగ్‌బాస్‌లో ఉన్న బాండ్‌నే కొనసాగిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరూ జంటగానే వెళ్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. కాగా 'ఫస్ట్‌టైం' అనే మూవీతో అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అఖిల్‌కు జంటగా అనిక విక్రమన్‌  హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అఖిల్‌కు జోడీగా మోనాల్‌ను తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. కొత్త హీరోయిన్‌ను తీసుకునే బదులు మోనాల్‌ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అఖిల్‌ క్లారిటీ ఇచ్చేశారు. మూవీకి ఎవరిని హీరోయిన్‌గా తీసుకోవాలనే ఛాయిస్‌ డైరెక్టర్‌దేనని,ఆయనే కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేశారని బదులిచ్చారు.

అంతేకాకుండా తామిద్దరం కలిసి తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌సిరీస్‌ చేయనున్నట్లు తెలిపాడు.  ఇక సినిమా విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక దాదాపు 27 స్టోరీలు విన్నానని, 'ఫస్ట్‌ టైం' స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. 

చదవండి: మోనాల్‌తో వీడియో కాల్‌, అఖిల్‌ కామెంట్ వైరల్‌‌‌
నాగబాబు వాట్సాప్‌ డీపీ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు